News January 29, 2025

పిట్లం: అడ్డొచ్చిన కుక్క.. ఇద్దరికి గాయాలు

image

పిట్లం శివారులోని హైవే-161 పై కుక్క అడ్డు రావడంతో బైక్‌ అదుపు తప్పిపడి ఇద్దరికి గాయాలయ్యాయి. వివరాలిలా.. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం బోర్గికి చెందిన శ్యామ్ రావు బైక్‌పై తన భార్యతో కలిసి పిట్లం నుంచి స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో కుక్క అడ్డు రావడంతో అదుపుతప్పి పడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. హైవే సిబ్బంది చికిత్స నిమిత్తం పిట్లం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Similar News

News January 9, 2026

తొక్కుడు బిళ్ల ఆడతారా?

image

AP: కనుమరుగవుతున్న సంప్రదాయ గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. కర్రా బిళ్ల, తొక్కుడు బిళ్ల, తాడాట, తాడు లాగుడు, ఏడు పెంకులాట, కర్రసాము, గాలిపటాలు ఎగిరేయడం లాంటి ఆటల పోటీలను నిర్వహించనుంది. శాప్ అధ్వర్యంలో ఈ నెల 10, 11, 12 తేదీల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో ఇవి జరగనున్నాయి. అన్ని వయసుల వాళ్లూ పాల్గొనవచ్చు. విజేతలకు బహుమతులు, నగదు ప్రోత్సాహకాలు అందిస్తారు.

News January 9, 2026

కామారెడ్డి జిల్లాలో రాత్రి ACCIDENT

image

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. లింగంపేట మండలం సూరాయిపల్లికి చెందిన కూలీలు వరినాట్లు వేసేందుకు ఆటోలో భిక్కనూర్ మండలం అంతంపల్లికి వెళ్లారు. వారు తిరిగి వస్తుండగా జిల్లా కేంద్రంలో ముందున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో పదిమందికి గాయాలయ్యాయి. వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

News January 9, 2026

మంచిర్యాల: యాక్సిడెంట్.. డిగ్రీ విద్యార్థి మృతి

image

రంగారెడ్డి జిల్లాలోని <<18794592>>మోకిల <<>>వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జన్మభూమి నగర్‌కు చెందిన విద్యార్థి దుర్మరణం చెందారు. మంచిర్యాలకు చెందిన దేవుళ్ల సూర్యతేజ HYDలో డిగ్రీ చదువుతున్నాడు. స్నేహితుడి బర్త్ డే వేడుకలు జరుపుకొని కారులో తిరిగి వస్తుండగా బారికేడ్లను తప్పించబోయి అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో విద్యార్థిని తీవ్రంగా గాయపడింది.