News January 29, 2025

సమన్వయంతో విధులు నిర్వహించాలి: సీపీ అనురాధ

image

పోలీస్ అధికారులు సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం సిద్దిపేట వన్ టౌన్, మహిళా పోలీస్ స్టేషన్, టాస్క్ ఫోర్స్ కార్యాలయాలను సీపీ సందర్శించారు. స్టేషన్ పరిసర ప్రాంతాలు, సీజ్ చేసిన వాహనాలు పరిశీలించారు. మొక్కలు నాటారు. ప్రజల రక్షణే ధ్యేయంగా విధులు నిర్వహించి మన్ననలు పొందాలని సిబ్బందికి సూచించారు.

Similar News

News March 1, 2026

ప్రజావాణికి సకాలంలో హాజరు కావాలి: భద్రాద్రి కలెక్టర్

image

సోమవారం(రేపు) కలెక్టరేట్‌లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ అంకిత్ తెలిపారు. ప్రజలు తమ తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వక ఫిర్యాదులను సమర్పించాలని సూచించారు. ఉదయం 10:30 గంటలకు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. సంబంధిత శాఖాధికారులు ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను వెంటనే స్వీకరించాలని అన్నారు.

News March 1, 2026

గోదావరిఖని నుంచి కన్యాకుమారికి RTC టూర్ ప్యాకేజీ

image

గోదావరిఖని నుంచి కన్యాకుమారి వరకు యాత్ర ప్యాకేజీ ఏర్పాటు చేసినట్లు DM నాగభూషణం తెలిపారు. యాత్రలో భాగంగా కాణిపాకం, అరుణాచలం, శ్రీరంగం, ఫళని, పాతాళశెంబు (కరుంగళిమాల) మధురై, కంచి, రామేశ్వరం, కన్యాకుమారి, జోగులాంబ శక్తిపీఠం లాంటి పుణ్యక్షేత్రాల దర్శనాలు ఉంటాయని తెలిపారు. పెద్దలకు రూ.9999గా, పిల్లలకు రూ.6500గా నిర్ణయించామన్నారు. వివరాలకు, టికెట్ల రిజర్వేషన్ కోసం 7013504982 సంప్రదించాలన్నారు.

News March 1, 2026

ఇరాన్‌లోని లక్ష్యాలపై క్లాడ్ AI సాయంతో US దాడి

image

ఇరాన్‌పై దాడిలో ఆంథ్రోపిక్ క్లాడ్ AI సాంకేతికను US వినియోగించినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. శత్రువులపై నిఘా, యుద్ధంలో లక్ష్యాలను గుర్తించడానికి క్లాడ్‌ను వాడిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నట్లు వివరించింది. యుద్ధంలో తమ AIని వాడేందుకు ఆంథ్రోపిక్ నిరాకరించడంతో ట్రంప్ దాని కాంట్రాక్టును ఇటీవల రద్దుచేయడం తెలిసిందే. అయితే US రక్షణ వ్యవస్థలో అప్పటికే ఆ AI ఇంటిగ్రేట్ అయి ఉండడంతో వినియోగించారంది.