News January 29, 2025

చెదిరిపోతున్న భారత విద్యార్థుల కల?

image

అమెరికాలో పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తూ పట్టుబడితే వీసా రద్దు చేస్తామని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో భారత విద్యార్థుల ఆశలు అడియాశలవుతున్నాయి. దాదాపు 3 లక్షల మంది భారత విద్యార్థులు అయోమయంలో పడిపోయారు. చదువుకునేందుకు డబ్బు లేక, చదువు మధ్యలో వదిలేసి స్వదేశానికి రాలేక తలలు పట్టుకుంటున్నారు. అమెరికాలో చదవాలంటే దాదాపు రూ.40 లక్షల వరకు ఖర్చు అవుతుండగా, చాలామంది అప్పు చేసే అక్కడికి వెళ్తున్నారు.

Similar News

News January 29, 2026

పోలీసు సేవకు సలాం చెప్పాల్సిందే!

image

అందరూ కుటుంబంతో మేడారం జాతరకు వెళ్తే పోలీసులు మాత్రం మన కోసం కుటుంబాన్ని వదిలి పహారా కాస్తున్నారు. నేడు సమ్మక్క తల్లి గద్దెపైకి రానున్న తరుణంలో భక్తుల రద్దీ భారీగా ఉంటుంది. ఒక్క చిన్న ప్రమాదం, పొరపాటు కూడా జరగకుండా వారు అత్యంత జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో క్రమశిక్షణతో మహాజాతరను శాంతియుతంగా పూర్తి చేసుకుందాం. పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుదాం.

News January 29, 2026

కేసీఆర్‌కు సమయం ఇవ్వాలని సిట్ నిర్ణయం!

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు విచారణకు హాజరుకాలేనని మాజీ సీఎం కేసీఆర్ రాసిన లేఖపై సిట్ స్పందించింది. ఆయనకు సమయం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తదుపరి విచారణ తేదీపై సస్పెన్స్ కొనసాగుతోంది. సిట్ మరోసారి నోటీసులు ఇస్తుందా? ఎప్పుడు, ఎక్కడ విచారిస్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది. తనను ఎర్రవల్లిలోనే <<18996095>>ప్రశ్నించాలని<<>> కేసీఆర్ కోరిన విషయం తెలిసిందే.

News January 29, 2026

నెలకు ₹5 లక్షల మేకప్.. పోలీసులకే షాకిచ్చిన ‘గ్లామరస్’ దొంగ

image

బెంగళూరులో ఓ ‘గ్లామరస్’ దొంగ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. భక్తి ముసుగులో గుళ్లు, రద్దీ ప్రదేశాల్లో బంగారాన్ని కాజేస్తున్న గాయత్రి, ఆమె భర్త శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి ₹60 లక్షల విలువైన గోల్డ్ స్వాధీనం చేసుకున్నారు. సంపన్న మహిళగా కనిపిస్తే ఎవరూ గుర్తించరని.. అందుకోసం నెలకు ₹4-5 లక్షలు కేవలం మేకప్ కోసమే ఖర్చు చేస్తానని ఆమె అంగీకరించడం పోలీసులను షాక్‌కు గురిచేసింది.