News January 29, 2025

రుద్రంగి: ఆన్‌లైన్ బెట్టింగ్‌లో నష్టం.. అద్దె ఇంట్లో చోరీ

image

బెట్టింగ్‌లకు అలవాటుపడి ఓ యువకుడు డబ్బుల కోసం అద్దె ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. ఎల్లారెడ్డిపేట SI రమాకాంత్ కథనమిలా.. రుద్రంగికి చెందిన కాసోజ్ విజయ్, బందారపు గంగిరెడ్డి ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడ్డాడు. అద్దెకు ఉంటున్న ఇంట్లోనే చోరీ చేశాడు. 4 తులాల బంగారు గొలుసు, అర తులం చైన్ ఎత్తుకెళ్లాడని ఎస్సై తెలిపారు.

Similar News

News December 28, 2025

CAT: 99 పర్సెంటైల్ వచ్చినా సీటు కష్టమే!

image

IIMలలో ప్రవేశాలకు పోటీ ఎక్కువగా ఉంటుంది. ప్రవేశ పరీక్ష CATలో అసాధారణ ప్రతిభ కనబర్చాలి. కానీ ఇటీవల CATలో టాపర్లు పెరిగిపోతుండటంతో 99% పైగా పర్సెంటైల్ వచ్చినా సీట్లు రావడం లేదు. సీట్ల సంఖ్య తక్కువగా ఉండటం, టాపర్లు ఎక్కువగా ఉండటమే కారణం. CAT 2025లో 12 మందికి 100% మార్కులు, 26 మందికి 99.99, 26 మందికి 99.98% మార్కులు వచ్చాయి. ఒకప్పుడు 99.30% వస్తే సీటు దక్కేది. ఇప్పుడా పరిస్థితి లేకపోవడం గమనార్హం.

News December 28, 2025

నేడు నాగర్‌కర్నూల్ జిల్లాలో కేటీఆర్‌, కవిత పర్యటన

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆదివారం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవిత పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో సర్పంచులు, ఉపసర్పంచుల సమావేశంలో కేటీఆర్‌ పాల్గొనగా.. కల్వకుర్తి, అచ్చంపేటల్లో కవిత పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారు. ఒకే రోజు అన్నచెల్లెళ్లు జిల్లాకు వస్తుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. వీరి పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి.

News December 28, 2025

ధనుర్మాసం: పదమూడో రోజు కీర్తన

image

‘శుక్రుడు ఉదయించి, బృహస్పతి అస్తమించాడు. పక్షులు కిలకిలరావాలతో ఆకాశంలోకి ఎగిశాయి. తెల్లవారింది లెమ్ము. బకాసురుని సంహరించిన కృష్ణుడిని, రావణుని అంతం చేసిన రాముడిని కీర్తిస్తూ, వారిని సేవించుకోవడానికి ఇది మంచి సమయం. వికసించిన తామర కన్నులు గల ఓ సుందరీ! నీ కపట నిద్ర వీడి, మాతో కలిసి పవిత్ర స్నానమాడి వ్రతంలో పాల్గొను. నీ రాకతో మనందరికీ శుభం కలుగుతుంది’’ అని గోపికలు ప్రార్థిస్తున్నారు. <<-se>>#DHANURMASAM<<>>