News January 29, 2025

శ్రీకాకుళం: వర్సటీ పరీక్షల ఫలితాలు విడుదల

image

ఎచ్చెర్ల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో పలు కోర్సుల పరీక్షలు ఫలితాలను ఎగ్జామినేషన్స్ డీన్ ఎస్.ఉదయ్ భాస్కర్ మంగళవారం విడుదల చేశారు. ఈ ఫలితాలను జ్ఞానభూమి వెబ్సైట్, విశ్వవిద్యాలయ వెబ్సైట్లలో అందుబాటులో ఉంచామన్నారు. రీవాల్యుయేషన్‌కు 15 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. మార్కుల జాబితాలు విద్యార్థులకు అందజేస్తామని చెప్పారు. 

Similar News

News March 12, 2025

శ్రీకాకుళం: ఏసీబీకి చిక్కిన బీసీ వెల్ఫేర్ సీనియర్ అసిస్టెంట్

image

శ్రీకాకుళం జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసుకు చెందిన Sr.అసిస్టెంట్ బుడుమూరు బాలరాజు లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీకి చిక్కారు. ఇంక్రిమెంట్ల, ఎంట్రీ, బిల్లుల ప్రాసెస్ చేసే విషయంలో అదే శాఖకు చెందిన వివిధ B.C హాస్టల్‌లో పనిచేస్తే అటెండర్, కుక్‌ల నుంచి రూ.25,000 లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

News March 12, 2025

శ్రీకాకుళంలో ఇంటర్ పరీక్షలకు 427 మంది గైర్హాజరు

image

శ్రీకాకుళం జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. బుధవారం ఇంటర్ పరీక్షలకు హాజరైన విద్యార్థుల వివరాలను RIO దుర్గారావు ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 19,093 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 18,666 మంది హాజరైనట్లు వెల్లడించారు. 427 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మాల్ ప్రాక్టీస్ ఒక దగ్గర జరిగిందని స్పష్టం చేశారు.

News March 12, 2025

మందస: భార్య, కూతురు అదృశ్యం..కేసు నమోదు

image

మందస మండలం వాసుదేవపురం గ్రామానికి చెందిన పానిల సింహాచలం (27) తన భార్య జ్యోతి (22), కుమార్తె హన్విక (11నెలలు) కనిపించడం లేదంటూ..మంగళవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 10వ తేదీన నా భార్య, కూతురు మందస మండలం కొర్రాయి గేటు వద్ద బస్సు ఎక్కి కాశీబుగ్గ వచ్చారని, అప్పటినుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని, బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

error: Content is protected !!