News January 29, 2025
తిరుపతి: వైసీపీ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా శేఖర్ రెడ్డి

తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవికి వైసీపీ ఆభ్యర్థి ఎంపికపై ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇందులో 42వ డివిజన్ కార్పొరేటర్ శేఖర్ రెడ్డిని ఎంపిక చేసేందుకు కార్పొరేటర్లు నిర్ణయం తీసుకున్నారు. 3వ తేదీ జరిగే ఎన్నికల్లో ఏకగ్రీవంగా శేఖర్ రెడ్డిని గెలిపించుకోవాలని తీర్మానించారు. కూటమికి మద్దతు తెలిపిన వారు హాజరుకాలేదు.
Similar News
News January 10, 2026
అమరావతిలో క్వాంటం సెంటర్‌కు టెండర్ ఖరారు

AP: రాజధానిలో క్వాంటం వ్యాలీ నిర్మాణ దిశగా మరో కీలక అడుగు పడింది. అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణానికి సంబంధించిన టెండర్‌ను APCRDA ఖరారు చేసింది. రూ.103 కోట్లతో L-1 బిడ్‌గా నిలిచిన ఎల్ అండ్ టీ సంస్థకు అప్పగిస్తూ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ జారీ చేసింది. ఈ ప్రాజెక్టు నమూనా రూపకల్పన నుంచి నిర్మాణం వరకూ L&Tనే చేపట్టనుంది. సెంటర్ నిర్మాణానికి CRDA నిధుల నుంచి రూ.137 కోట్లు కేటాయించారు.
News January 10, 2026
కర్నూలు: Be Careful.. సంక్రాంతి హెచ్చరిక

సంక్రాంతి పండుగను లక్ష్యంగా చేసుకుని ఫేక్ షాపింగ్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని డీఐజీ, కర్నూలు జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. నకిలీ వెబ్‌సైట్లు, ఫేక్ యాప్‌లు, ఫిషింగ్ లింకులు, WhatsApp, SMSల ద్వారా వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ సమాచారం, OTPలు దోచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News January 10, 2026
తిరుపతి SVIMSలో ఉద్యోగాలు

తిరుపతి శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్ (<


