News March 18, 2024
ట్రోలింగ్‌పై తొలిసారి స్పందించిన హార్దిక్
ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యను ఆ జట్టు ఫ్రాంచైజీ ప్రకటించినప్పటి నుంచి అతడిపై హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై హార్దిక్ తొలిసారి స్పందించారు. ‘నేను రోహిత్ అభిమానుల భావోద్వేగాలను గౌరవిస్తా. కానీ, వారిని కంట్రోల్ చేయలేను. వారిని గౌరవిస్తూనే కెప్టెన్‌గా ఏం చేయాలనేదానిపై దృష్టి పెడతా’ అని పాండ్య చెప్పుకొచ్చారు.
Similar News
News December 25, 2024
తీవ్ర అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
AP: నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఇవాళ బలహీనపడుతుందని IMD వెల్లడించింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా విస్తరించి ఉందని తెలిపింది. వీటి ప్రభావంతో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలు కురుస్తాయంది. కాగా బంగాళాఖాతంలో 2 రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.
News December 25, 2024
గాంధీ వందేళ్ల జ్ఞాపకం.. 2 రోజులు CWC సమావేశాలు
ఏఐసీసీ అధ్యక్షుడిగా మహాత్మా గాంధీ బాధ్యతలు స్వీకరించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రేపు, ఎల్లుండి కాంగ్రెస్ ప్రత్యేక భేటీ నిర్వహించనుంది. కర్ణాటకలోని బెలగావిలో జరిగే ఈ సమావేశానికి ‘నవ సత్యాగ్రహ బైఠక్’గా పేరు పెట్టింది. 26వ తేదీన CWC సభ్యులు, పీసీసీలు, సీఎల్పీలు సహా 200 మంది కీలక నేతలు హాజరై పలు అంశాలపై చర్చిస్తారు. 27న నిర్వహించే సంవిధాన్ ర్యాలీలో లక్ష మంది కార్యకర్తలు పాల్గొంటారు.
News December 25, 2024
ఏపీ కొత్త సీఎస్‌గా సాయి ప్రసాద్?
AP: రాష్ట్ర CS నీరభ్ కుమార్ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో కొత్త CS ఎవరనే ఉత్కంఠ నెలకొంది. సీనియార్టీ జాబితాలో IAS శ్రీలక్ష్మి టాప్‌లో ఉన్నారు. అయితే ఆమెను నియమించడానికి CM సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఆమె తర్వాత అనంతరాము ఉన్నప్పటికీ సాయిప్రసాద్ వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఉత్తర్వులు వెలువడుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈయన గతంలో CBN పేషీలో కార్యదర్శిగా పనిచేశారు.