News January 29, 2025
HNK: బాలుడి గొంతు కోసిన బాలిక తండ్రి (UPDATE)

HNKలో ఓ బాలుడిపై బాలిక(17) తండ్రి దాడి చేసి గొంతు కోయగా.. బాలిక సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇంటర్ చదువుతున్న బాలిక WGLకు చెందిన ఓ బాలుడితో కొన్నాళ్లుగా ప్రేమలో ఉంది. మంగళవారం ఇంట్లో ఎవరూ లేరని అతడిని ఇంటికి పిలిచింది. అప్పుడే బాలిక తండ్రి ఇంటికి రాగా.. కూతురితో సన్నిహితంగా ఉన్న బాలుడి గొంతు కోశాడు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన బాలిక ఉరేసుకుంది. బాలుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
Similar News
News November 6, 2025
విశాఖ: డీసీసీబీలో అవినీతి ఆరోపణలు

విశాఖ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన పదోన్నతుల వ్యవహారం బ్యాంకులో కలకలం సృష్టిస్తోంది. పదోన్నతుల విషయంలో రూ.కోటి వరకు మామూళ్లు వసూలు చేశారన్న గుసగుసలు వినిపించాయి. బ్యాంకులో అవినీతి అక్రమాలపై అప్కాబ్కు ఫిర్యాదులు అందాయి. అన్ని విధాలుగా అర్హతలు ఉన్న వారిని పక్కన పెట్టి అర్హత లేని వారికి పదోన్నతలు ఇచ్చారన్న విమర్శలు వచ్చాయి.
News November 6, 2025
కైకలూరు ఇటు.. నూజివీడు అటు.. మరి పెనమలూరు?

జిల్లాల మార్పుపై మంత్రివర్గ ఉపసంఘం నుంచి స్పష్టత రానుంది. ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లాలోకి, కైకలూరు నియోజకవర్గం కృష్ణా జిల్లాలోకి రానున్నాయి. కాగా, ఎన్టీఆర్ జిల్లాకు దగ్గరగా ఉన్నప్పటికీ పెనమలూరును కృష్ణా జిల్లాలోనే ఉంచుతారనే చర్చ రావడంతో స్థానికులు, ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి.
News November 6, 2025
అఫ్గాన్తో చర్చలు విఫలమైతే యుద్ధమే: పాక్

ఇవాళ ఇస్తాంబుల్లో శాంతి చర్చల నేపథ్యంలో అఫ్గాన్ ప్రభుత్వానికి పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హెచ్చరికలు జారీ చేశారు. అఫ్గాన్లో తాలిబన్లను ఎదుర్కోవడానికి సైనిక ఘర్షణే ఏకైక పరిష్కారమా అని రిపోర్టర్ ప్రశ్నించగా.. ‘చర్చలు విఫలమైతే యుద్ధం జరుగుతుంది’ అని ఆసిఫ్ పేర్కొన్నారు. గత నెల ఇరు దేశాల మధ్య కుదిరిన సీజ్ఫైర్ ఒప్పందానికి కొనసాగింపుగా ఇవాళ తుర్కియే, ఖతర్ చొరవతో మరోసారి చర్చలు జరగనున్నాయి.


