News January 29, 2025

వికారాబాద్: మండలాల వారీగా రైతు భరోసా జమ (2)

image

మోమిన్‌పేట్ మం. బాల్రెడ్డి గూడలో రైతు భరోసా 472, ఆత్మీయ భరోసా 14, బషీరాబాద్, కిస్మాపూర్ 419, ఆత్మీయ భరోసా 29, యాలాల్, తిమ్మాయిపల్లి, 565, ఆత్మీయ భరోసా 40, దౌల్తాబాద్, నందారం 374, ఆత్మీయ భరోసా 11, దుద్యాల, సంగిపల్లి 824, ఆత్మీయ భరోసా 07, కోట్‌పల్లి, కంకణాలపల్లి, 322, ఆత్మీయ భరోసా 57, మర్పల్లి, గండ్లమర్పల్లి 363, ఆత్మీయ భరోసా 29 మంది రైతుల ఖాతాలో జమ చేసినట్టు అధికారులు తెలిపారు.

Similar News

News November 14, 2025

KMR: అద్దె ప్రాతిపదికన వ్యాన్

image

కామారెడ్డి జిల్లా మహిళా సాధికారత కేంద్రం అవసరాల నిమిత్తం ECO వ్యాన్‌ను అద్దె ప్రాతిపదికన నడుపుటకు టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు KMR జిల్లా సంక్షేమ అధికారిని ప్రమీల తెలిపారు. ఆసక్తి గల వారు తమ వాహన డాక్యుమెంట్ ప్రతులతో కూడిన దరఖాస్తులను సీల్డ్ కవర్‌లో ఈ నెల 20వ తేదీ వరకు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అద్దె చెల్లించబడుతుందని పేర్కొన్నారు.

News November 14, 2025

ట్రంప్‌కు క్షమాపణలు చెప్పిన BBC

image

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ వీడియోను తప్పుగా ఎడిట్ చేసినందుకు ప్రముఖ మీడియా సంస్థ <<18245964>>BBC<<>> ఆయనకు క్షమాపణలు చెప్పింది. వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకుందామని పేర్కొంది. అయితే పరువునష్టం చెల్లించాలన్న ట్రంప్ డిమాండ్‌ను తిరస్కరించింది. తాము ఉద్దేశపూర్వకంగా వీడియో ఎడిట్ చేయలేదని స్పష్టం చేసింది. ట్రంప్ డాక్యుమెంటరీని తిరిగి ప్రసారం చేసే ఉద్దేశం తమకు లేదని బీబీసీ న్యాయవాది తెలిపారు.

News November 14, 2025

TTD ఈవోను ప్రశ్నించిన సిట్ ఆధికారులు..?

image

తిరుమల కల్తీ నెయ్యి కేసుపై ఏర్పాటైన సీబీఐ సిట్ అధికారులు విచారణ వేగవంతం చేశారు. టీటీడీ ప్రస్తుత ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ను రెండు రోజులు క్రితం కలిసినట్లు సమాచారం. నెయ్యి టెండర్ల విధివిధానాలు మార్చినప్పుడు ఈవోగా ఆయనే ఉండటంతో దానిపై మాట్లాడినట్లు తెలుస్తోంది. టెండర్ల గురించి ముందు అధికారులను అడిగితే తెలుస్తుందని మాజీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు. దీంతో సింఘాల్‌ను కలిసి ఈ అంశాలపై చర్చినట్లు సమాచారం.