News January 29, 2025
BREAKING: కుంభ్ స్పెషల్ ట్రైన్లను ఆపేసిన ఇండియన్ రైల్వే
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32023/1679908321315-normal-WIFI.webp)
ప్రయాగ్‌రాజ్‌కు కోట్లాది మంది వస్తుండటంతో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మహా కుంభమేళా స్పెషల్ ట్రైన్లను ఇండియన్ రైల్వే నిలిపివేసింది. తర్వాతి ఆదేశాలు వచ్చేంత వరకు ఆపేస్తున్నట్టు తెలిపింది. రెగ్యులర్ ట్రైన్లు యథావిధిగా నడుస్తాయని వెల్లడించింది.
Similar News
News February 19, 2025
ముందుగానే ఒంటిపూట బడులు ప్రారంభించాలని డిమాండ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739962849464_367-normal-WIFI.webp)
తెలుగు రాష్ట్రాల్లో మార్చి నెల రాక ముందే ఎండలు మండిపోతున్నాయి. ఉ.10 గంటలు దాటితే ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. దీంతో స్కూళ్లలో ఈసారి ముందుగానే ఒంటిపూట బడులు ప్రారంభించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. సాధారణంగా మార్చి మూడో వారం నుంచి హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి. పరీక్షలు ముగిసే వరకు ఉ.7.45 నుంచి మ.12.30 వరకు స్కూళ్లు పని చేస్తాయి.
News February 19, 2025
ఇండియాలో అత్యంత ఎత్తైన ఫ్యామిలీ వీళ్లదే!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739959291743_746-normal-WIFI.webp)
కుటుంబంలో ఒక్కరు లేదా ఇద్దరు పొడుగ్గా ఉండటం కామన్. కానీ ఫ్యామిలీలో ఉన్న నలుగురూ తలెత్తుకుని చూసేంత ఎత్తుగా ఉంటే? మహారాష్ట్రలోని పుణేలో కులకర్ణి కుటుంబం ఇండియాలోనే అత్యంత ఎత్తైనది. గతంలో అత్యంత ఎత్తైన కుటుంబంగా లిమ్కా బుక్ వరల్డ్ రికార్డులోనూ చోటు సంపాదించుకుంది. నలుగురి ఉమ్మడి ఎత్తు 26 అడుగులు. తండ్రి 6.8 ఫీట్, తల్లి 6.2 ఫీట్, మొదటి కూతురు 6.6 ఫీట్, రెండో కూతురు 6.4 ఫీట్ ఉన్నారు.
News February 19, 2025
‘తండేల్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739696595796_1032-normal-WIFI.webp)
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘తండేల్’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ వచ్చే నెల 7న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తుందని టాక్. చందూ మొండేటి తెరకెక్కించిన ఈ మూవీ ఈ నెల 7న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టి సత్తా చాటింది.