News January 29, 2025

ఖమ్మం: దుమ్మురేపుతున్న త్రిష

image

గతేడాది U-19 ఆసియా కప్‌ను భారత్ గెలుచుకోవడంతో కీలక పాత్ర పోషించిన భద్రాచలం అమ్మాయి గొంగిడి త్రిష మహిళల అండర్ -19 ప్రపంచకప్‌లో దుమ్ము రేపుతోంది. మంగళవారం స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో 59 బంతులు ఎదుర్కొన్న త్రిష 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఇలానే ఆడితే టీమిండియా సీనియర్ జట్టుకు ఎంపికవడం ఖాయమని జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News July 6, 2025

ఇందిరమ్మ ఇల్లు రానివారు ఆందోళన చెందొద్దు: ఖమ్మం కలెక్టర్

image

మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాబోయే రోజుల్లో మంజూరవుతాయని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. నిరుపేదలైన అర్హులకు దశల వారీగా ఇళ్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుకను ఉచితంగా ఆయా సమీప రీచ్‌ల నుంచి అందిస్తున్నామన్నారు. అటు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని సూచించారు.

News July 6, 2025

రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన గత ప్రభుత్వం: పొంగులేటి

image

గత పాలకులు రూ.8.19 లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇచ్చిన అనేక హామీలను అమలు చేశామని, రాబోయే రోజుల్లో మరికొన్ని హామీలను కూడా అమలు చేస్తామని చెప్పారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నూతన రేషన్ కార్డులు, సన్నం బియ్యం పంపిణీ, సన్నాలకు రూ.500 బోనస్, ఫ్రీ బస్సు, ఇందిరమ్మ ఇళ్ల పథకం వంటి అనేక హామీలను అమలుచేశామన్నారు.

News July 6, 2025

ఖమ్మం: కవిత పర్యటనకు బీఆర్ఎస్ నేతలు డుమ్మా.. కారణమిదేనా?

image

ఖమ్మం జిల్లాలో ఇటీవల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటన హాట్ టాపిక్‌గా మారింది. ఆమె పర్యటనలో పార్టీ కీలక నేతలు పువ్వాడ అజయ్, కందాల, సండ్ర, వద్దిరాజు రవిచంద్ర, తాత మధు ఎక్కడా కనిపించలేదు. బీఆర్ఎస్‌లో తనకు కేసీఆర్ తప్పా మరో లీడర్ లేరని కవిత చేసిన కామెంట్స్ వల్లే ఆపార్టీ నేతలంతా దూరంగా ఉన్నారనేది టాక్.‌ ఆమె పర్యటనలో జిల్లా నేతలు లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.