News March 18, 2024
నేను ఎప్పటికీ మీ సోదరినే: తమిళిసై
తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేయడంపై తమిళిసై స్పందించారు. ‘ప్రజా సేవ కోసం తిరిగి వెళ్తున్నా. తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలు. నేను ఎప్పటికీ మీ సోదరినే. నాపై చూపిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు’ అని తెలిపారు. కాగా, తమిళిసై తమిళనాడు నుంచి ఎంపీగా పోటీచేయనున్నట్లు సమాచారం.
Similar News
News October 31, 2024
స్థలం, రేషన్కార్డు ఉంటేనే ఇందిరమ్మ ఇల్లు?
TG: దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది సొంత స్థలం, రేషన్ కార్డున్న వారికే ఇల్లు ఇవ్వాలని భావిస్తోందని తెలుస్తోంది. ఈ నిబంధన వల్ల ఎక్కువగా వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఒకవేళ స్థలం, రేషన్ కార్డున్న వారికే ఇస్తే 30లక్షల దరఖాస్తులు బుట్టదాఖలు కావాల్సి ఉంటుంది.
News October 31, 2024
దీపావళి వేళ ఈ 5 ప్రదేశాల్లో దీపాలు పెట్టండి!
దీపావళి పర్వదినాన ఇంట్లోని కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో దీపాలు వెలిగించాలని వేద పండితులు చెబుతున్నారు. ఇంటి గడపకు ఇరువైపులా, వంట గది, ధాన్యాగారం, తులసికోట, రావిచెట్టు కింద దీపం పెట్టాలని సూచిస్తున్నారు. దీంతో పాటు ఆలయాలు, మఠాలు, గోశాలలు, వృక్షాలు, ఇంట్లోని ప్రతి మూలలోనూ దీపాలు వెలిగిస్తే మంచిదని చెబుతున్నారు. నాలుగు వీధుల కూడలిలో దీపం వెలిగించాలంటున్నారు.
News October 31, 2024
ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యంతో తులతూగాలి: మోదీ
ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దివ్యమైన వెలుగుల పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యంతో తులతూగాలని కోరుకున్నారు. లక్ష్మీగణేశుల ఆశీర్వాదంతో అందరూ సంపన్నమవ్వాలని ప్రార్థించారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు ప్రజలకు విషెస్ చెబుతున్నారు. ఏపీ Dy CM పవన్ కళ్యాణ్ పాక్, బంగ్లా, అఫ్గాన్లోని హిందువులకూ శుభాకాంక్షలు చెప్పడం తెలిసిందే.