News January 29, 2025

పెంచికల్ పేట్ రేంజ్‌లో బర్డ్ వాక్ ఫెస్టివల్

image

కొమIరం భీమ్ జిల్లా కాగజ్‌నగర్ డివిజన్ పెంచికల్ పేట్ అటవీ శాఖ రేంజ్‌లో ఫిబ్రవరి 2న ప్రపంచ నేలల దినోత్సవం సందర్భంగా బర్డ్ వాక్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు డీఎఫ్‌వో నీరజ్ కుమార్ టిబ్రేవాల్ ఒక ప్రకటనలో తెలిపినారు. ఇందులో పాల్గొనేందుకు పక్షి ప్రేమికులు రూ.1500 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. జంగిల్ సఫారి, రవాణా భోజన వసతి కల్పిస్తామన్నారు.

Similar News

News November 7, 2025

పనులు మరింత వేగవంతంగా సాగాలి: హనుమకొండ కలెక్టర్

image

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి మరింత వేగవంతంగా సాగే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. హనుమకొండలోని కలెక్టరేట్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై గృహ నిర్మాణ, ఆర్డీఓ, మెప్మా, ఎంపీడీవోలతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి,ఇంకా ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టని లబ్ధిదారుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు.

News November 7, 2025

బయోగ్యాస్ ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచండి: వరంగల్ మేయర్

image

బయోగ్యాస్ ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో గల బయోగ్యాస్ విద్యుత్ ప్లాంట్‌ను కమిషనర్ చాహత్ బాజ్ పాయ్‌తో కలిసి మేయర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఎంహెచ్ఓ డా.రాజారెడ్డిన, ఎంహెచ్ఓ డా.రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.

News November 7, 2025

దేవసేన, అధికారులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు: FATHI

image

TG: ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి దేవసేన, సీఎం కార్యాలయ అధికారులపై తాము ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని ‘FATHI’ అధ్యక్షుడు రమేశ్ Dy.CM భట్టితో చర్చల సందర్భంగా తెలిపారు. తమ కామెంట్స్‌ను వక్రీకరించారన్నారు. దీన్ని ఖండిస్తూ ఇప్పటికే ఉన్నతాధికారులకు వివరణ ఇచ్చామని పేర్కొన్నారు. ఇక సమ్మె కారణంగా నిలిచిపోయిన పరీక్షలను వర్సిటీ అధికారులతో మాట్లాడి నిర్వహిస్తామని వెల్లడించారు.