News January 29, 2025
జానీ మాస్టర్‌పై ఛాంబర్ కేసు గెలిచింది: ఝాన్సీ

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కేసు గెలిచిందని నటి ఝాన్సీ వెల్లడించారు. ఛాంబర్ విధించిన ఆంక్షల్ని జానీ జిల్లా కోర్టులో సవాలు చేశారని, ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టేసిందని పేర్కొన్నారు. ‘పనిప్రదేశాల్లో మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడమే కాక సంస్థలు POSH నిబంధనలు అమలుచేయాలని గుర్తుచేసే ఈ తీర్పు చాలా కీలకం’ అని ఆమె పేర్కొన్నారు.
Similar News
News November 3, 2025
బస్సు ప్రమాదంలో 25కు పెరిగిన మృతుల సంఖ్య

TG: రంగారెడ్డి జిల్లా బస్సు ప్రమాదంలో <<18183371>>మృతుల సంఖ్య<<>> భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు 25 మంది మరణించారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులంతా తాండూరు, చేవెళ్ల వాసులేనని సమాచారం. మరోవైపు ఘటనాస్థలం వద్ద స్థానికులు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే యాదయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డు విస్తరణ ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు.
News November 3, 2025
ఎయిమ్స్ రాయ్‌బరేలిలో జూనియర్ రెసిడెంట్ పోస్టులు

ఎయిమ్స్ రాయ్‌బరేలి 16 జూనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఎంబీబీఎస్, BDS అర్హతతో పాటు ఇంటర్న్‌షిప్ చేసినవారు ఈనెల 10న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థుల గరిష్ట వయసు 37ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.56,100 జీతం అందుతుంది. వెబ్‌సైట్: https://aiimsrbl.edu.in/
News November 3, 2025
గర్భిణుల్లో విటమిన్ D లోపం ఉంటే ఈ సమస్యలు

ప్రెగ్నెన్సీలో మహిళలు అన్ని పోషకాలు అందేలా ఆహారం తీసుకోవాలి. అప్పుడే శిశువు ఆరోగ్యంగా ఉంటుంది. పుట్టుకతో ఎలాంటి లోపాలు, వ్యాధులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా గర్భిణుల్లో విటమిన్ డి లోపం ఉండడం వల్ల శిశువులు అధిక బరువు, గుండె జబ్బులు, మల్టిపుల్ స్లెరోసిస్ బారిన పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ D సప్లిమెంట్లు వాడటం, సూర్యరశ్మిలో సమయం గడపడం వల్ల దీన్ని అధిగమించొచ్చని సూచిస్తున్నారు.


