News January 29, 2025

HNK: విద్యార్థిని ఆత్మహత్య

image

HNK నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఫార్మసీ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాలు.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌కు చెందిన సాయి చందన(21) ఈ నెల 26న హాస్టల్లోని గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. తోటి విద్యార్థులు, యాజమాన్యం ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. విద్యార్థి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి.

Similar News

News January 31, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

image

✔MBNR:పీయూ డిగ్రీ ఫలితాలు విడుదల
✔420 హామీలతో అధికారంలోకి వచ్చిన పార్టీ కాంగ్రెస్:BRS
✔NRPT:ఆకతాయిలు వేధిస్తే చట్టపరమైన చర్యలు:పోలీసులు
✔ఘనంగా మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు
✔7 నుంచి మన్యంకొండ బ్రహ్మోత్సవాలు
✔బిజినపల్లి: కుష్ఠి వ్యాధి నిర్మూలనపై ప్రతిజ్ఞ
✔సీఎంఆర్ఎఫ్ పేదల ఆరోగ్యానికి ఆర్థిక భరోసా:ఎమ్మెల్యేలు
✔గద్వాల: విద్యార్థిని చితకబాదిన టీచర్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

News January 31, 2025

ఒంగోలు: ‘సకాలంలో లక్ష్యాలను సాధించాలి’

image

జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు  గురువారం ఇండియన్ మెడికల్ హాల్‌లో  వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, కుటుంబ, సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రమేశ్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను సకాలంలో లక్ష్యాలను సాధించాలని ఆయన వైద్య సిబ్బందికి ఆదేశించారు.

News January 31, 2025

వీటిని బెడ్‌పై ఉంచి నిద్ర పోతున్నారా?

image

రాత్రి నిద్రపోయేముందు కొన్ని వస్తువులు బెడ్ దగ్గర పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. జెట్ కాయిల్స్, ఫోన్లు, ల్యాప్‌టాప్స్ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు దూరంగా పెట్టాలి. బెడ్‌పై పెడితే అవి పేలే ప్రమాదం ఉంది. అలాగే బట్టలు, ఔషధాలు, ఆహార పదార్థాలు ఉండకూడదు. వీటి కోసం చీమలు, బొద్దింకలు వస్తాయి. టెడ్డీ బేర్‌ను పక్కన పెట్టుకుని నిద్రించకూడదు. దానిపై ఉండే దుమ్ము, బ్యాక్టీరియా ఆరోగ్యానికి హాని చేస్తాయి.