News January 29, 2025
నిర్మల్: ‘వాహనదారులు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కలిగి ఉండాలి’

వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల అన్నారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్మల్ ఎన్టీఆర్ మిని స్టేడియం నుంచి శివాజీ చౌక్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, ఫోర్ వీలర్ వాహనదారులు సీటు బెల్టు తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
Similar News
News July 6, 2025
NZB: రూ.500 కోట్లతో ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి: కవిత

కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.500 కోట్లతో ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆదివారం ఏకలవ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎరుకల సామాజికవర్గానికి అన్ని పార్టీలు రాజకీయంగా అవకాశాలు కల్పించాలని సూచించారు.
News July 6, 2025
రేపు ములుగు జిల్లాలో మంత్రుల పర్యటన

మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క జిల్లాలో సోమవారం పర్యటించనున్నారు. కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం మండలాల్లో నకిలీ విత్తనాలతో పంటకు నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెక్కులను అందజేయనున్నారు. అనంతరం సీతక్క మంగపేట, ఏటూరునాగారం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే కార్యక్రమంలో పాల్గొననున్నారు.
News July 6, 2025
రాజమండ్రి : ప్రయాణికులకు గమనిక

ఆషాఢ మాసం సందర్భంగా రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్లే ఇంద్ర ఏ.సీ బస్సు ధరలో 15% రాయితీ కల్పించినట్లు ఆర్టీసీ డీఎం కె.మాధవ తెలిపారు. నేడు ఆయన ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. రాజమండ్రి – హైదరాబాద్‌కు సూపర్ లగ్జరీ తక్కువ ధరకు ఇంద్ర ఏ.సీ బస్సులో ప్రయాణించ వచ్చుని అన్నారు.ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు. ప్రస్తుత టిక్కెటు ధర రూ.1060లు కాగా రాయితీపై ధర రూ.920గా ఉందని చెప్పారు.