News January 29, 2025
మల్దకల్: రెండు ద్విచక్ర వాహనాలు ఢీ

రెండు బైకులు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన బుధవారం మల్దకల్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండల కేంద్రం నుంచి వస్తున్న బైక్, సద్దలోని పల్లి గ్రామం నుంచి వస్తున్న బైక్ ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించారు.
Similar News
News March 12, 2025
ఖమ్మం: పట్టుపట్టాడు.. కొలువులు సాధిస్తున్నాడు..

పట్టుదలతో ప్రభుత్వ కొలువులు సాధించుకుంటూ వస్తూ యువతకు ఆదర్శంగా నిలిచాడు. తాజాగా గ్రూప్- 2లో 387 మార్కులతో స్టేట్ 148 ర్యాంక్, జోన్‌లో 20వ ర్యాంక్ సాధించాడు. అతడే తల్లాడ మండలం మల్లవరంకు చెందిన దుగ్గిదేవర వెంకటేశ్వరరావు. తొలి ప్రయత్నంలోనే 2018లో పంచాయితీ కార్యదర్శిగా, 2019లో FBOగా, 2020లో విద్యుత్ శాఖలో జూనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్ కొలువులను వరుసగా సాధిస్తూ వచ్చాడు.
News March 12, 2025
భువనగిరి జిల్లాలో 85 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం

యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది. పోచంపల్లి మండలంలోని ఓ గ్రామంలో 85 ఏళ్ల వృద్ధురాలిపై ఇద్దరు యువకులు ఆదివారం రాత్రి అత్యాచారానికి పాల్పడ్డారు. సోమవారం వృద్ధురాలి గదిలోకి వెళ్లిన కోడలికి వృద్ధురాలు వివస్త్రగా కనిపించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
News March 12, 2025
పోసాని విడుదలకు బ్రేక్!

AP: వైసీపీ మద్దతుదారు పోసాని కృష్ణమురళి విడుదలకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఆయన కోసం గుంటూరు సీఐడీ పోలీసులు కర్నూలు జిల్లా జైలు వద్దకు వెళ్లి పీటీ వారెంట్ వేశారు. దీంతో ఆయన్ను వర్చువల్‌గా జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. కాగా, పోసానిపై నమోదైన కేసుల్లో బెయిల్ రాగా నేడు విడుదల అవుతారని వార్తలొచ్చాయి. తాజాగా సీఐడీ పీటీ వారెంట్ దాఖలుతో విడుదల నిలిచిపోనున్నట్లు సమాచారం.