News January 29, 2025
పల్లి రైతుల ఆందోళన కనిలించడం లేదా సీఎం గారూ: కవిత

వేరుశనగ రైతుల ఆందోళన కనిపించడం లేదా సీఎం రేవంత్ రెడ్డి గారూ అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసలే దిగుబడి లేక సతమతమవుతున్న రైతుకు గిట్టుబాటు ధర కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ పక్క వ్యాపారుల మోసం, మరోపక్క ప్రభుత్వం శీతకన్నులో వేరుశనగ రైతుల ఆందోళనతో మహబూబ్‌నగర్ జిల్లా అట్టుడుకుతోందన్నారు.
Similar News
News November 10, 2025
జూబ్లీ బైపోల్: ఓటు వేయడానికి 12 ఆప్షన్లు!

జూబ్లీహిల్స్‌లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటరు జాబితాలో పేరుంటే చాలు. ఓటరు గుర్తింపు కార్డు కాకుండా 12 ప్రత్యామ్నాయ ఫొటో IDలలో దేనినైనా పోలింగ్ సిబ్బందికి చూపించి ఓటేయొచ్చు. ఆధార్, జాబ్‌కార్డు, బ్యాంకు-పోస్టాఫిస్ పాస్‌బుక్, ఆరోగ్యబీమా స్మార్ట్ కార్డు, ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, PAN, పాస్‌పోర్ట్ చూపించి ఓటు వేయొచ్చని అధికారులు స్పష్టం చేశారు.
SHARE IT
News November 10, 2025
జూబ్లీ బైపోల్: తాయిలాలకు ‘NO’ చెప్పండి!

జూబ్లీహిల్స్ ఓటర్లు ఒకసారి ఆలోచించండి. మరో 3 ఏళ్ల వరకు అవకాశం రాదు. తాయిలాలకు తలొగ్గకండి. సమస్యలు పరిష్కరించే సామర్థ్యం ఉన్న వ్యక్తినే అసెంబ్లీకి పంపండి. మద్యం పంచిన వారికి కాదు.. మంచి చేసే సమర్థత ఉన్న వారికి ఓటేయండి. పైసలు పంపిణీ చేసిన వారికి కాకుండా.. పనులు చేసే సత్తా ఉన్న అభ్యర్థికి పట్టం కట్టండి. అభివృద్ధి చేసే సత్తా ఉన్న అభ్యర్థిని గెలిపించండి. వజ్రాయుధం వంటి ఓటును వినియోగించుకోండి.
News November 10, 2025
కోకాపేట్, మూసాపేట్‌లో భూముల వేలం!

కోకాపేట్, మూసాపేట్ ప్రాంతాల్లోని 9 ఖాళీ ప్లాట్ల ఈ-వేలం కోసం HMDA సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి నవంబర్ 17 ఉదయం 11:00 గంటలకు T-Hub వేదికగా ప్రీ-బిడ్ సమావేశం నిర్వహించనుంది. కోకాపేట్ నియోపోలిస్ (6), గోల్డెన్ మైల్ (1), మూసాపేట్‌లో (2) ప్లాట్లు వేలం వేయనున్నారు. ఆసక్తిగల డెవలపర్లు పాల్గొనవచ్చని HMDA పిలుపునిచ్చింది. మరింత సమాచారం కోసం www.hmda.gov.inను సంప్రదించండి.
SHARE IT


