News January 29, 2025

పెడనలో వ్యక్తిపై కత్తితో దాడి

image

పెడన మండలం కట్లపల్లిలో కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కట్లపల్లి గ్రామానికి చెందిన గంగాధరరావు (65)పై పక్కనే నివసిస్తున్న కాశీవిశ్వేశ్వరరావు(37) కత్తితో దాడి చేశాడన్నారు. గంగాధరరావును వైద్యా సేవల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

Similar News

News September 13, 2025

ఈ నెల 15 నుంచి గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు

image

జిల్లా పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఛాంబర్‌లో కలెక్టర్ డీ.కే. బాలాజీ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. పశుసంపదను రక్షించేందుకు ప్రతి రైతు ఈ టీకా కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన సూచించారు.

News September 12, 2025

కృష్ణా: వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం

image

ముఖ్యమంత్రి చంద్రబాబు సెప్టెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించే కలెక్టర్‌ల కాన్ఫరెన్స్‌కు అవసరమైన నివేదికలను వెంటనే సమర్పించాలని కలెక్టర్ డీ.కే. బాలాజి అధికారులు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమావేశమై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు.

News September 11, 2025

కృష్ణా: సబ్ జూనియర్ సెపక్ తక్రా క్రీడాకారుల ఎంపిక

image

కృష్ణా జిల్లా సెపక్ తక్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో సబ్ జూనియర్ బాల, బాలికల జట్లను ఎంపిక చేసినట్లు జిల్లా కార్యదర్శి పవన్ కుమార్ తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 13, 14 తేదీలలో అనంతపురం జిల్లాలోని ఉరవకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు నరేష్ పాల్గొన్నారు.