News January 29, 2025

ఘనంగా శ్రీ సీతారాముల నిత్యకల్యాణం

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో రామయ్యకు ఘనంగా నిత్య కళ్యాణం నిర్వహించారు. స్వామి వారికి సుప్రభాతసేవ జరిపారు. అనంతరం ఆరాధన, నివేదన సేవాకాలం, నిత్యహోమాలు, నిత్య బలిహరణం నిర్వహించారు. తదుపరి స్వామి వారి కల్యాణమూర్తులకు కల్యాణతంతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఉద్యోగులు, సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Similar News

News September 17, 2025

నిజాం కాలం నాటి ఆసిఫాబాద్ జైలు

image

ఆసిఫాబాద్ జిల్లాలోని జన్కాపూర్‌లో 1916లో ఐదెకరాల్లో నిర్మించిన జైలు భవనం చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. డంగు సున్నంతో నిర్మించిన ఇందులో 200 మంది ఖైదీలు ఉండేలా మూడు బారక్‌లు ఉన్నాయి. 1991లో మరమ్మతులు చేసి తిరిగి ప్రారంభించగా, 2008లో జిల్లా జైలు తరలింపు తర్వాత ఇది సబ్ జైలుగా రూపాంతరం చెందింది. ఈ భవనం ఇప్పటికీ చారిత్రక ప్రాధాన్యతను కలిగి ఉంది.

News September 17, 2025

వరంగల్: ట్రెండ్ ఫాలో అవ్వండి.. కానీ మోసపోకండి..!

image

‘సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఫొటోలు, లింకుల కోసం అపరిచిత వెబ్‌సైట్లను ఆశ్రయించకండి. తెలియని వ్యక్తులు షేర్ చేసిన లింకులపై క్లిక్ చేయకండి’ అని వరంగల్ పోలీసులు హెచ్చరించారు. సైబర్ మోసగాళ్ల వలలో పడకుండా జాగ్రత్తపడాలని, ఏ వెబ్‌సైట్‌ అయినా యూఆర్‌ఎల్‌ను రెండుసార్లు చెక్ చేయడం అలవాటు చేసుకోవాలని తమ అధికారిక X ఖాతా ద్వారా ప్రజలకు సూచించారు.

News September 17, 2025

జూబ్లీహిల్స్ టికెట్ నాకే ఇవ్వాలి: అంజన్ కుమార్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎంపీ పేరు అనుహ్యంగా తెరమీదకు వచ్చింది. ఇటీవల ‘రావాలి అంజన్న.. కావాలి అంజన్న’ అంటూ వెలసిన ఫ్లెక్సీలకు అంజన్ కుమార్ యాదవ్ బలం చేకూర్చారు. ‘యాదవ సామాజిక వర్గానికి సిటీలో ప్రాతినిధ్యం లేదు. జూబ్లీహిల్స్ టికెట్ నాకే ఇవ్వాలి’ అంటూ కుండబద్దలు కొట్టారు. మంత్రి పదవి కోరుకోవడంలో తప్పేముందని, హైకమాండ్ తనకే టికెట్ ఇస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.