News January 29, 2025
‘బాపట్ల జిల్లాలో 2024లో 226 మంది చనిపోయారు’

గత 2024 సంవత్సరంలో బాపట్ల జిల్లాలో జరిగిన 500కు పైగా ప్రమాదాలలో సుమారు 226 మంది చనిపోయారని బాపట్ల మోటారు వాహన తనిఖీ అధికారి ప్రసన్న కుమారి చెప్పారు. బుధవారం రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా బాపట్లలోని డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ గ్రౌండ్‌లో వాహన దారులకు అవగాహన కల్పించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం వలన ప్రమాదాలలో రక్షణ లభిస్తుందన్నారు. సహాయ అధికారి కిషోర్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News November 13, 2025
నేటి నుంచి టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపు

AP: నేటి నుంచి ఈ నెల 25 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా టెన్త్ పరీక్షల ఫీజులు చెల్లించవచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 3 వరకు రూ.50, డిసెంబర్ 10 వరకు రూ.200, డిసెంబర్ 15 వరకు రూ.500 లేట్ ఫీజుతో చెల్లించవచ్చని వెల్లడించారు. ఫీజును https://bse.ap.gov.inలో స్కూల్ లాగిన్ ద్వారా మాత్రమే చెల్లించాలన్నారు. గడువు పొడిగింపు ఉండబోదని స్పష్టంచేశారు.
News November 13, 2025
కొబ్బరి సాగు.. భూమిని బట్టి నీరివ్వాలి

కొబ్బరి తోటలను నల్ల భూముల్లో పెంచుతుంటే 20 రోజులకు ఒకసారి, తేలికపాటి ఎర్రభూముల్లో సాగు చేస్తుంటే 10 రోజులకు ఒకసారి తప్పకుండా నీటిని అందించాలి. తేలిక భూముల్లో అయితే వేసవి కాలంలో 5 నుంచి 7 రోజులకు ఒకసారి నీటి తడులు అందించాలి. కొబ్బరి తోటలు నీటి ఎద్దడికి గురికాకుండా జాగ్రత్త పడాలి. తోటల్లో నీటి ఎద్దడి వల్ల కొబ్బరిలో పిందెరాలడం, కాయ పరిమాణం తగ్గడం వంటి సమస్యలు తలెత్తి పంట దిగుబడి తగ్గుతుంది.
News November 13, 2025
ఖమ్మం జిల్లాలో 52,260 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు

ఖమ్మం జిల్లాలో ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో ఇప్పటి వరకు మొత్తం 326 కొనుగోలు కేంద్రాల ద్వారా 52,260 క్వింటాళ్ల నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేసినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్ కుమార్ తెలిపారు. తల్లాడ, కల్లూరు మండలాల్లో 101 మంది రైతుల నుంచి సేకరించిన 5,134 క్వింటాళ్ల సన్న రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్‌గా రూ.25.67 లక్షలు 3 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ కానున్నాయని ఆయన వెల్లడించారు.


