News March 18, 2024

ఆ విషయంలో భారత్ చైనాకు సాటి రాలేదు: మోర్గాన్ స్టాన్లీ

image

చైనాకు దీటుగా భారత్ గణనీయ వృద్ధి సాధిస్తోందని నిపుణులు పేర్కొంటున్న వేళ మోర్గాన్ స్టాన్లీ సంస్థ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కొన్ని దశాబ్దాలుగా ఏడాదికి సగటున 8-10% సాధించిన చైనా ఆర్థిక వృద్ధికి భారత్ సాటి రాలేదని పేర్కొంది. అయితే 6.5-7% సగటుతో భారత్ తన వృద్ధిని కొనసాగిస్తుందని అంచనా వేసింది. మౌలిక వసతులు, నైపుణ్యాల్లో కొరత భారత్ ఆర్థికవృద్ధి జోరుకు అడ్డుపడుతున్నాయని తెలిపింది.

Similar News

News January 9, 2025

టెన్త్ ఎగ్జామ్ ఫీజు గడువు పొడిగింపు

image

TG: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల ఫీజు గడువును సర్కార్ మరోసారి పొడిగించింది. రూ.1,000 ఫైన్‌తో ఈ నెల 22 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. రెగ్యులర్/ప్రైవేట్ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఇకపై ఫీజు గడువు పొడిగింపు ఉండదని స్పష్టం చేసింది. మరోవైపు ఫీజు చెల్లించిన విద్యార్థుల జాబితాను ఈ నెల 24లోగా డీఈఓలకు సమర్పించాలని పేర్కొంది. వాటిని డీఈఓలు ఈ నెల 25లోగా తమకు పంపాలని ఆదేశించింది.

News January 9, 2025

స్పేస్ డాకింగ్ ప్రయోగం మరోసారి వాయిదా: ఇస్రో

image

స్పేస్ డాకింగ్ ప్రయోగం(స్పేడెక్స్) మరోసారి వాయిదా పడినట్లు ISRO తెలిపింది. ఉపగ్రహాల కదలిక చాలా నెమ్మదిగా ఉందని, ఊహించిన దానికంటే వాటి మధ్య దూరం ఎక్కువగా ఉన్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు ఉపగ్రహాలు సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించింది. తదుపరి డాకింగ్ తేదీని మాత్రం ISRO వెల్లడించలేదు. 2 ఉపగ్రహాలను భూకక్ష్యలో అనుసంధానించడమే లక్ష్యంగా ఈ నెల 7న జరగాల్సిన ప్రయోగం నేటికి, నేడు మరోసారి వాయిదా పడింది.

News January 9, 2025

నేడు మీ టికెట్ యాప్ సేవలు ప్రారంభం

image

TG: సమయాన్ని వృథా చేయకుండా ఉన్న చోటు నుండే టికెట్లు బుక్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మీ టికెట్ యాప్ తీసుకొచ్చింది. ఈ అప్లికేషన్ సేవలను ప్రభుత్వం నేడు ప్రారంభించనుంది. దీని ద్వారా రాష్ట్రంలోని జూ పార్క్‌లు, మెట్రో రైలు, ఆర్టీసీ బస్సు, ఆలయాలు, పార్కులు, క్రీడలకు సంబంధించిన టికెట్లు బుక్ చేసుకోవచ్చు. దీంతో సులభంగా ప్రవేశం పొందవచ్చని పేర్కొంది.