News January 29, 2025
మహా కుంభమేళా తొక్కిసలాట భయానకం: HYD వాసి

యూపీ మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట భయానకంగా ఉందని, అంతా గందరగోళం నెలకొందని మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ మార్కండేయ స్వామి గుడి పూజారి నాగభూషణం శర్మ తెలిపారు. ఆయన కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రయాగరాజ్ వెళ్లారు. అక్కడ నుంచి తన అనుభవాన్ని ఫోన్‌లో Way2Newsప్రతినిధితో పంచుకున్నారు. అమావాస్య కావడంతో అర్ధరాత్రి తర్వాత స్నానాలఘాట్ వద్దకు భారీగా జనం రాగా తొక్కిసలాట జరిగిందన్నారు. తాము క్షేమంగా ఉన్నామన్నారు.
Similar News
News September 17, 2025
ASF: గంజాయి సాగు.. పదేళ్ల జైలు శిక్ష

గంజాయి సాగు చేసిన నిందితుడికి ASF జిల్లా కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. వాంకిడి ఎస్ఐ మహేందర్ తెలిపిన వివరాలు.. వాంకిడి మండలం సోనాపూర్‌కి చెందిన జంగు 2022లో అక్రమంగా గంజాయి మొక్కలను సాగు చేస్తూ పోలీసులకు చిక్కాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని రిమాండ్‌కు తరలించారు. మంగళవారం జిల్లా కోర్టులో నేరం రుజువు కావడంతో జిల్లా జడ్జి రమేశ్ జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు తెలిపారు.
News September 17, 2025
హైదరాబాద్ సంస్థానం.. తెలంగాణ ప్రస్థానం

8 తెలుగు, 3 కన్నడ, 5 మరాఠీ జిల్లాల సమూహమే హైదరాబాద్ సంస్థానం. దేశంలోని 550 సంస్థానాల్లో అతిపెద్దది. నాడు కోటీ 80 లక్షల జనం ఉంటే ఇందులో 50 శాతం తెలుగువారే. 25 శాతం మరాఠీ, 12 శాతం ఉర్దూ, 11 శాతం కన్నడ, ఇతర భాషాల వారు HYD సంస్థానంలో ఉండేవారు. ప్రపంచంలోనే ధనికుల్లో ‘నిజాం’ ఒకడిగా ఉండేవారని చరిత్ర చెబుతోంది. 1948 SEP 17న ఈ సంస్థానం ఆపరేషన్ పోలోతో భారత్‌లో విలీనమైంది. తెలంగాణ ప్రస్థానం మొదలైంది.
News September 17, 2025
నేడు విశాఖకు సీఎం చంద్రబాబు

AP: ఇవాళ CM చంద్రబాబు విశాఖకు వెళ్లనున్నారు. AU కన్వెన్షన్ సెంటర్లో జరిగే ‘స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమంలో పాల్గొంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో OCT 2వరకు చేపట్టనున్న ప్రత్యేక వైద్య శిబిరాల ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తారు. మ.3 గంటలకు రాడిసన్ బ్లూ రిసార్ట్స్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఆధ్వర్యంలో జరిగే సదస్సులో పాల్గొంటారు. తర్వాత VJA బయల్దేరతారు.