News January 29, 2025
SRPT: మున్సిపల్ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనా!

SRPT జిల్లాలోని మున్సిపాలిటీలకు ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు లేదని ప్రభుత్వ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మున్సిపల్ పాలకవర్గాల పదవీ కాలానికి తెరపడిన విషయం తెలిసిందే. పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో ఆ మరుసటి రోజు నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. మరో ఆరు నెలలు లేదా ఏడాది పాటు ప్రత్యేక పాలన కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News September 18, 2025
ఉత్తరాఖండ్‌లో పేరేచర్ల యువకుడి మృతి

ఉత్తరాఖండ్‌లోని రుషికేశ్ ఎయిమ్స్‌లో వైద్య విద్య అభ్యసిస్తున్న మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామానికి చెందిన జగదీశ్‌బాబు (30) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కష్టపడి జాతీయ స్థాయిలో మంచి ర్యాంకు సాధించి, వైద్య సీటు పొందిన జగదీశ్ మృతి పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరయ్యారు. బుధవారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
News September 18, 2025
యాదాద్రి శ్రీవారికి భారీగా నిత్య ఆదాయం

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య ఖజానాకు బుధవారం సమకూరిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో వెంకట్రావు వెల్లడించారు. అందులో ప్రధాన బుకింగ్, ప్రత్యేక దర్శనాలు, ప్రసాద విక్రయాలు, యాదరుషి నిలయం, కళ్యాణకట్ట వ్రతాలు కార్ పార్కింగ్ అన్నదాన విరాళాలు తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.42,98,522
ఆదాయం వచ్చింది.
News September 18, 2025
RTCలో డ్రైవర్ పోస్టులు.. అర్హతలు ఇవే

TGSRTCలో 1,000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజైన సంగతి తెలిసిందే. డ్రైవర్ పోస్టులకు వయో పరిమితి 22 ఏళ్ల నుంచి 35 ఏళ్లుగా నిర్ణయించారు. కనీస విద్యార్హత పదో తరగతి పాసై ఉండాలి. పేస్కేల్ రూ.20,960-60,080గా ఉంటుంది. హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ (HPMV), హెవీ గూడ్స్ వెహికల్ (HGV) లేదా ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. పూర్తి వివరాలకు ఇక్కడ <