News January 29, 2025

ఉద్యోగాలు ఇస్తామని ఫేక్ ఫోన్ కాల్స్ వస్తే నమ్మకండి: DMHO

image

రాత పరీక్ష రాసినటువంటి అభ్యర్థులకు వైద్య ఆరోగ్యశాఖలో రెగ్యులర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు ఫోన్ కాల్స్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని హనుమకొండ డీఎంహెచ్‌వో అప్పయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఎవరైనా ఫేక్ కాల్స్‌ను నమ్మి మోసపోవద్దని పేర్కొన్నారు. ఇలాంటి కాల్స్ వచ్చినట్లయితే తమ దగ్గరలోని పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 1930కి కాల్ చేయాలని ఆయన సూచించారు.

Similar News

News September 14, 2025

బాపట్ల జిల్లా SP నేపథ్యం ఇదే.!

image

బాపట్ల జిల్లా SPగా ఉమామహేశ్వర్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమామహేశ్వర్ ప్రస్తుతం సీఐడీ విభాగంలో ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో గురజాల, కడప, ఆదిలాబాద్ జిల్లాలో DSPగా పని చేశారు. అనంతరం ASPగా పదోన్నతి పొంది అదిలాబాద్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో బాధ్యతలు స్వీకరించారు. ఇంటెలిజెన్స్, విజిలెన్స్, సీఐడీ విభాగాలలో కూడా విధులు నిర్వహించారు.

News September 14, 2025

17న జిల్లా బంద్‌కు పిలుపునిచ్చిన కార్మిక సంఘాలు

image

ఈనెల 17న రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు జిల్లా బంద్ చేపడతామని కార్మిక సంఘ నాయకులు తెలిపారు. శనివారం చీపురుపల్లిలో బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. ఫ్రీ బస్సుతో రోడ్డున పడ్డ ఆటో, టాక్సీ డ్రైవర్లకు రూ.25 వేలు ఆర్థిక భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ఆర్టీవో వేధింపులు, ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్లను రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గరివిడి, చీపురుపల్లి, మెరకముడిదం, రాజాం డ్రైవర్లు పాల్గొన్నారు.

News September 14, 2025

గండికోటకు అవార్డు

image

న్యూఢిల్లీలో ఈ నెల 11 నుంచి 13 వరకు జరిగిన బిజినెస్ లేజర్ ట్రావెల్ అండ్ మైస్ ఎగ్జిబిషన్ (BLTM 2025)లో గండికోటకు ‘మోస్ట్ ప్రామిసింగ్ న్యూ డెస్టినేషన్ అవార్డు’ లభించింది. ‘భారతదేశపు గ్రాండ్ కేనియన్‌’గా ప్రసిద్ధి చెందిన గండికోటకు ICRT, భారత ప్రభుత్వం పర్యాటక మంత్రిత్వ శాఖ మద్దతుతో నిర్వహించిన రెస్పాన్సిబుల్ టూరిజం అవార్డ్స్‌లో ఈ అవార్డు లభించింది.