News January 29, 2025

భార్య వేరొకరితో కన్న బిడ్డకూ భర్తే తండ్రి: సుప్రీంకోర్టు

image

భార్య మరొకరితో కన్న పిల్లలకూ భర్తే చట్టబద్ధంగా తండ్రి అవుతాడని సుప్రీంకోర్టు తెలిపింది. ఎవిడెన్స్ యాక్ట్‌లోని 112వ సెక్షన్ ఇలాగే ప్రెస్యూమ్ చేస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. భాగస్వాముల మధ్య నాన్ యాక్సెస్‌తోనే అక్రమ సంబంధాన్ని ఆరోపిస్తున్న వ్యక్తే నిరూపించాల్సి ఉంటుందంది. నిరూపణ కోసం DNA టెస్టులకు కోర్టులు అనుమతించొద్దని ఆదేశించింది. అక్రమ సంతానంపై కేరళ మాజీ దంపతుల కేసు విచారణలో ఇలా పేర్కొంది.

Similar News

News March 1, 2026

తీవ్రమైన యుద్ధం.. అమెరికాకు ఇరాన్ షాక్!

image

ఖమేనీ మరణం తర్వాత పశ్చిమాసియా యుద్ధం తీవ్రమవుతోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా మిలిటరీ స్థావరాలపై ఇరాన్ దాడులను పెంచింది. కువైట్‌లోని US నావల్ బేస్‌పై 4 బాలిస్టిక్ మిస్సైళ్లు, 12 డ్రోన్లతో దాడి చేసినట్లు ఇరాన్ తెలిపింది. దీంతో ఆ షిప్ పూర్తిగా దెబ్బతిందని, భారీగా అమెరికా సైనికులు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. అటు UAEలోని అమెరికా MSP క్లాస్ షిప్‌పై 4 డ్రోన్లతో దాడి చేసినట్లు సమాచారం.

News March 1, 2026

NCERTలో 117 ఉద్యోగాలు

image

NCERTలో 117 అకడమిక్ పోస్టులకు అప్లై చేయడానికి మార్చి 6 ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PG, M.LSc, NET/SET/SLET, PhD/M.Phil, అర్హతతో పాటు టీచింగ్/ రీసెర్చ్ అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.1000. ప్రొఫెసర్‌కు నెలకు రూ.1,44,200, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,31,400, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ లైబ్రేరియన్‌కు రూ.57,700 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.ncert.nic.in

News March 1, 2026

3 నెలల్లో 3 టార్గెట్లు.. నెక్స్ట్ ఎవరో!

image

2026 ప్రారంభంలో అమెరికా తీసుకున్న సంచలన నిర్ణయాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. జనవరిలో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించడం, ఫిబ్రవరిలో మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఎల్ మెంచో హతమవ్వడం, తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోవడం సంచలనంగా మారాయి. ఈ వరుస పరిణామాలతో అమెరికా తదుపరి టార్గెట్ ఎవరనే చర్చ నెట్టింట జోరుగా సాగుతోంది. అగ్రరాజ్యం తన దూకుడుతో అంతర్జాతీయ రాజకీయ ముఖచిత్రాన్ని వేగంగా మారుస్తోంది.