News January 29, 2025
గద్వాల: రేపు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాహనాలకు వేలం

గద్వాల:పోలీస్ తనిఖీలో పట్టుబడి ఎవరూ క్లెయిమ్ చేసుకోని (స్క్రాబ్) 73 వాహనాలకు గురువారం ఉదయం 9:00 గంటలకు బహిరంగవేలం నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల బిడ్డర్స్ ఈరోజు సాయంత్రం వరకు ఎంట్రీ ఫీజు రూ. 200/- చెల్లించాలన్నారు. ఆధార్ కార్డ్ జిరాక్స్ కాఫీతో వేలంలో పాల్గొనాలన్నారు.
Similar News
News January 9, 2026
గోరంట్లలో మృతదేహం లభ్యం

గుర్తుతెలియని మృతదేహం లభ్యం అయినట్లు గోరంట్ల సీఐ బోయశేఖర్ తెలిపారు. రెడ్డిచెరువు పల్లికి వెళ్లే దారిలోని చెట్ల పొదల్లో మృతదేహం కనపడినట్లు వీఆర్ఓ అనిల్ కుమార్ ఫిర్యాదు చేశారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. మృతదేహం సమీపంలో బీడీ కట్టలు, అగ్గిపెట్టె, తట్ట ఉన్నాయని, యాచకుడిగా భావిస్తున్నామని, ఎవరైనా గుర్తిస్తే తెలియజేయాలని పేర్కొన్నారు.
News January 9, 2026
శరీరానికి కొల్లాజెన్ ఎందుకు అవసరమంటే?

కొల్లాజెన్ అనేది ఒక ప్రోటీన్. ఇది కండరాలు, కీళ్ళు, చర్మం, జుట్టు, గోళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. శరీరం దానిని సహజంగా ఉత్పత్తి చేస్తుంది. కానీ వయస్సు పెరుగుతున్నకొద్దీ ఈ ప్రక్రియ మందగిస్తుంది. శరీరంలో కొల్లాజెన్ స్థాయి తగ్గినప్పుడు చర్మం ముడతలు పడడం, మొటిమలు రావడం, ఎముకలు బలహీనపడటం, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కండరాలను దృఢంగా మార్చడంలో కూడా కొల్లాజెన్ చాలా బాగా ఉపయోగపడుతుంది.
News January 9, 2026
నరదిష్టి ప్రభావం తొలగిపోవాలంటే?

నరదిష్టి ప్రభావంతో ఆర్థిక, ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. వాటి నుంచి బయటపడటానికి జ్యోతిష నిపుణులు కొన్ని పరిహారాలు సూచిస్తున్నారు. ‘సముద్ర జలాలను ఇల్లు, వ్యాపార స్థలాల్లో చల్లాలి. దొడ్డు ఉప్పు కలిపిన నీటితో స్నానం చేయాలి. మంగళవారం ఎరుపు వస్త్రంలో ఉప్పు కట్టి ఇంటి ముందు వేలాడదీయాలి. మరుసటి రోజు చెట్టు మొదట్లో వేయాలి. సాంబ్రాణి ధూపం, వినాయకుడి వద్ద దీపం వెలిగించడం మంచి ఫలితాలను ఇస్తాయి’ అంటున్నారు.


