News January 29, 2025

సిద్దిపేట: రోడ్డు ప్రమాదం UPDATE.. ముగ్గురు మృతి

image

పెద్దపల్లి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో <<15299553>>సిద్దిపేట<<>>కు చెందిన భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మృతుడు ఆకుల కనకయ్య వియ్యంకుడు జంగిటి జనార్ధన్(55) చిన్నకోడూరు మండలం గోనెపల్లి వాసి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. కనకయ్య పెద్ద కొడుకుకి లివర్ నుంచి బ్లడ్ రావడంతో ప్రస్తుతం సర్జరీ చేసినట్లు కుటుంబీకులు తెలిపారు.

Similar News

News January 7, 2026

సంచలనం.. చేతులు కలిపిన బీజేపీ-కాంగ్రెస్

image

ప్రధాన ప్రత్యర్థులైన BJP-INC ఓ స్థానిక ఎన్నిక కోసం చేతులు కలపడం చర్చనీయాంశమైంది. మహారాష్ట్రలోని అంబర్‌నాథ్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలో ఈ విచిత్రం జరిగింది. అక్కడ 60స్థానాలకుగాను శివసేన(షిండే) 27 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించి మ్యాజిక్ ఫిగర్‌కు 4సీట్ల దూరంలో ఆగిపోయింది. దీంతో BJP(14), INC(12), అజిత్ NCP(4), ఇద్దరు ఇండిపెండెంట్ల మద్దతుతో BJP అభ్యర్థి తేజశ్రీ అధ్యక్ష పీఠాన్ని చేజిక్కించుకున్నారు.

News January 7, 2026

కరీంనగర్‌లో హుస్నాబాద్‌ విలీనం?

image

హుస్నాబాద్ నియోజకవర్గం 3 జిల్లాల పరిధిలో ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌ను KNRలో విలీనం చేయాలని సీఎంకి పలుమార్లు విన్నవించారు. ఈ క్రమంలో మరోసారి జిల్లాల పునర్విభజన పరిశీలిస్తామని మంత్రి పొంగులేటి అసెంబ్లీలో ప్రకటించారు. ఒకే జిల్లా పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేలా చేస్తామని చెప్పడంతో హుస్నాబాద్ KNRలో విలీనం ఖాయమన్న చర్చ నడుస్తుంది.

News January 7, 2026

బిక్కనూర్: ప్రజాభిప్రాయం మేరకే నిర్ణయం: అదనపు కలెక్టర్

image

ప్రజాభిప్రాయం మేరకు <<18786558>>పరిశ్రమలను ఏర్పాటు చేసే<<>> విషయమై నిర్ణయం తీసుకుంటామని కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ అన్నారు. బుధవారం బిక్కనూర్‌లో ఫ్యూజన్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పరిశ్రమ ఏర్పాటు చేసే పరిసర ప్రాంతాల ప్రజలు తమ అభిప్రాయాలను వినతి పత్రాల ద్వారా తెలియజేయాలన్నారు. వాటిని పరిగణనలోకి తీసుకొని అనుమతులు ఇస్తామని చెప్పారు.