News March 18, 2024
తూ.గో, కోనసీమ జిల్లాల్లో ఎల్లుండి వర్షాలు!

తూర్పు గోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఈనెల 20వ తేదీన (బుధవారం) వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, పలుచోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Similar News
News April 4, 2025
తూ.గో: నేడు పిడుగులు పడే అవకాశం

తూ.గో జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ఎక్స్‌లో పోస్టు చేసింది. పిడుగుల పడే ఛాన్స్ ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గురువారం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడిన విషయం తెలిసిందే. తూ.గో జిల్లా నల్లజర్లలో నిన్న మధ్యాహ్నం పలు గ్రామాల్లో వర్షం కురిసింది. ఈ అకాల వర్షాలకు పంటలు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News April 4, 2025
గోపాలపురం: ఫ్యాన్‌కు ఉరేసుకొని మహిళ సూసైడ్

మనస్తాపానికి గురై ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. గోపాలపురం మండలం నందిగూడెం గ్రామంలో కోళ్ల ఫారంలో పనిచేస్తున్న సతామి కోటల్ (30)తో సునీల్ కోటల్ అనే వ్యక్తి సహజీవనం చేస్తున్నాడు. బుధవారం వీరి మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో మనస్తాపం చెందిన ఆ మహిళ ఇంటిలో ఫ్యాన్‌కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కోళ్ల ఫారం యజమాని సమాచారంతో పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
News April 3, 2025
రాజమండ్రిలో పార్మసిస్ట్ కేసు దర్యాప్తు

లైంగిక వేధింపుల కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడి అపార అపస్మారక స్థితిలో ఉన్న అంజలి కేసు విషయంలో దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగుతోందని డీఎస్పి భవ్య కిషోర్ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం స్థానిక ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కేసులో నిందితుడుని దీపక్‌ని అరెస్ట్ చేశామన్నారు. సూసైడ్ నోట్ ఆధారంగా చేసుకుని రాజకీయ లబ్ధికి కొందరు కేసును పక్కదారి పట్టించడం తగదన్నారు.