News January 29, 2025
గంభీరావుపేట: కారును ఢీకొన్న బైక్.. దంపతులకు గాయాలు

గంభీరావుపేట మండలం పెద్దమ్మ అటవీ ప్రాంతంలో బైక్ కారును ఢీకొట్టింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మాలోతు రమేశ్, రేణా అనే దంపతులు ఎక్స్ఎల్ వాహనంపై మాచారెడ్డికి వెళ్తూ ఎదురుగా వస్తున్న లింగాపూర్ గ్రామానికి చెందిన మధు కారును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో దంపతులకు తీవ్రగాయాలు కాగా స్థానికులు ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
Similar News
News February 25, 2026
బీబీనగర్-నడికుడి రైల్వే భూ సేకరణ ప్రక్రియ వేగవంతం

బీబీనగర్-నడికుడి రైల్వే రెండో లైన్ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు ఆర్డీఓ కృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం భువనగిరి మండలంలోని పగిడిపల్లి, అనాజిపురం, నందనం, బొమ్మాయిపల్లి తదితర గ్రామాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా రైతుల భూముల వివరాలను సేకరించి, సరిహద్దులను పరిశీలించారు. రైల్వే లైన్ విస్తరణకు అవసరమైన భూసేకరణలో పారదర్శకత పాటిస్తామని ఆర్డీఓ వెల్లడించారు.
News February 25, 2026
తాడిపత్రిలో కారు బీభత్సం.. 2 భాగాలుగా విడిపోయిన ట్రాక్టర్ ఇంజిన్

తాడిపత్రి మండలంలో కారు బీభత్సం సృష్టించింది. రూరల్ పరిధిలోని ఆర్డీటీ కాలనీ సమీపంలో ట్రాక్టర్‌ను కారు ఢీకొంది. ప్రమాదంలో ట్రాక్టర్ ఇంజిన్ భాగాలు రెండుగా విడిపోయాయి. కారుకు సేఫ్టీ బెలూన్స్ ఓపెన్ కావడంతో కారులో ఉన్న వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు. ట్రాక్టర్ డ్రైవర్‌కు గాయాలు కాగా స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News February 25, 2026
24 గంటలూ స్పీడ్ పోస్ట్ బుకింగ్

AP: ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేందుకు తపాలా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 11 నగరాల్లో 24 గంటలూ స్పీడ్ పోస్ట్, పార్సిల్ బుకింగ్ సేవలను అందించనుంది. ఆ జాబితాలో విశాఖ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, తిరుపతి, అనంతపురం, రాజమండ్రి, ఒంగోలు, గుంతకల్ ఉన్నాయి. అలాగే మరో 242 పట్టణాల్లో సబ్ పోస్టాఫీస్‌ల పనివేళలను రెండు గంటలు పెంచింది.


