News January 29, 2025

ఆ భూములు ప్రభుత్వానికి అప్పగించాలి: మంత్రి మండిపల్లి

image

రాయచోటిలోని స్టేట్ గెస్ట్ హౌస్‌లోబుధవారం మంత్రిమండిపల్లి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. గతంలో అటవీశాఖ మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేల ఎకరాల పేద ప్రజల భూములు, అటవీ భూములు, అటవీ సంపదను దోచుకున్నారన్నారు. ఇవన్నీ తిరిగి ప్రభుత్వానికి అప్పగించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News November 4, 2025

ఆదిలాబాద్: ప్రొవిజినల్ జాబితా విడుదల

image

ఆదిలాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖలో నియామకం కోసం సపోర్టు ఇంజనీరు ఉద్యోగానికి దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల ప్రొవిజనల్ జాబితాను విడుదల చేసినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు. జాబితాను జిల్లా కార్యాలయ నోటీసు బోర్డుతో పాటు అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచామన్నారు. జాబితాలో ఏమైనా సవరణలు, మార్పులు చేయాల్సి ఉన్నట్లయితే ఈ నెల 10 వరకు సంబంధిత సర్టిఫికెట్లతో కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

News November 4, 2025

ధాన్యం సేకరణ, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టండి: కలెక్టర్

image

మండల ప్రత్యేక అధికారులు తమ ప్రాంతాలలో సుడిగాలి పర్యటనలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును నిశితంగా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ధాన్యం సేకరణ ప్రక్రియతో పాటు రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీ (KGBV) వంటి విద్యాసంస్థలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆమె సమీక్షలో అధికారులకు సూచించారు.

News November 4, 2025

చిన్నారి వైష్ణవి హత్యకేసులో హైకోర్టు కీలక తీర్పు

image

AP: 2010 జనవరి 30న VJAలో అపహరణ, హత్యకు గురైన చిన్నారి వైష్ణవి కేసులో శిక్ష రద్దు చేయాలన్న నిందితుల పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. మోర్ల శ్రీనివాసరావు, యంపరాల జగదీశ్‌కు ట్రైల్ కోర్టు విధించిన జీవిత ఖైదును హైకోర్టు సమర్థించింది. మరో నిందితుడు వెంకట్రావును నిర్దోషిగా ప్రకటించి, శిక్ష రద్దు చేసింది. వైష్ణవిని కిడ్నాప్ చేసి హత్య చేశారు. తర్వాత GNT శారదా ఇండస్ట్రీస్‌లోని బాయిలర్‌లో వేసి బూడిద చేశారు.