News January 29, 2025

విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి: నిర్మల్ DEO

image

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని DEO రామారావు తెలిపారు. స్థానిక జిల్లాకేంద్రంలోని మంజులాపూర్ ప్రాథమిక పాఠశాలను ఆయన సందర్శించి FLN ప్రగతి నివేదికల ఆధారంగా విద్యార్థుల ప్రగతిని పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాథమిక విద్య పూర్తయ్యే‌లోగా పిల్లలందరూ నిర్ణీత సామర్థ్యాలు సాధించేలా కృషి చేయాలన్నారు.

Similar News

News July 7, 2025

ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోండి: DEO

image

జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు 2025 సంవత్సరానికి అర్హులైన ఉపాధ్యాయుల నుంచి ప్రతిపాదనలు కోరుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి రేణుక తెలిపారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని మండల, ఉప విద్యాశాఖ అధికారి ద్వారా ఈనెల 13వ తేదీలోగా http//nation-alawardstoteachers.education.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News July 7, 2025

చేప పిల్లలు వద్దు.. నగదు ఇవ్వండి: మత్స్యకారులు

image

TG: ప్రభుత్వం ఏటా మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను అందిస్తోన్న సంగతి తెలిసిందే. వాటిని కాంట్రాక్టర్ల ద్వారా పంపిణీ చేయడం వద్దని, నేరుగా సహకార సంఘాలకు నగదు బదిలీ చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. నగదు ఇస్తే తామే నాణ్యమైన చేప పిల్లలను కొనుగోలు చేసుకుంటామన్నారు. కాంట్రాక్టర్లు సైజ్, నాణ్యతలో నిబంధనలు పాటించట్లేదని ఆరోపిస్తున్నారు. INC నేత జీవన్ రెడ్డి సైతం నగదు అంశంపై మంత్రి శ్రీహరికి లేఖ రాశారు.

News July 7, 2025

జూబ్లీహిల్స్‌ కోసం దండయాత్ర!

image

జూబ్లీహిల్స్‌ కోసం రాజకీయ పార్టీలే కాదు ఉద్యమకారులు దండయాత్రకు సిద్ధమయ్యారు. తమకు న్యాయం చేయకపోతే ఉప ఎన్నికలో పోటీ చేస్తామని INCని హెచ్చరించారు. ఓ వైపు TDP వ్యూహం రచిస్తోంది. తాను పోటీలో ఉంటానని యుగ తులసి పార్టీ అధ్యక్షుడు శివకుమార్ ప్రకటించారు. ఇక ఇండిపెండెంట్లు ఎంతమంది వస్తారో తెలియని పరిస్థితి. ప్రధాన పార్టీలైన INC, BRS, BJP గెలుపు కోసం సర్వ శక్తులు ఒడ్డాల్సిన పరిస్థితి నెలకొంది.