News January 29, 2025

SRD: ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రత వారోత్సవాలు

image

సంగారెడ్డిలోని ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా ఆర్ఎం ప్రభులత మాట్లాడుతూ.. ఆర్టీసీలో పనిచేసే డ్రైవర్లు బస్సులను జాగ్రత్తగా నడపాలన్నారు. మద్యం సేవించి, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదన్నారు. నారాయణఖేడ్ డిపోలో పనిచేస్తున్న సయ్యద్‌కు ఉత్తమ డ్రైవర్‌గా అవార్డు అందించారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అరుణ, అన్ని డీపోల డీఎంలు పాల్గొన్నారు.

Similar News

News November 12, 2025

హైదరాబాద్‌లో జగిత్యాల వాసి అనుమానాస్పద మృతి

image

వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన ఘటన HYDలోని మియాపూర్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాలకు చెందిన సతీశ్ మియాపూర్‌లోని హాస్టల్‌లో ఉంటూ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి సతీశ్ హాస్టల్‌లోని తన రూమ్‌లో అపస్మారక స్థితిలో పడి ఉండటంతో హాస్టల్ యజమాని చూడగా అప్పటికే మృతిచెందాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారొచ్చి కేసు నమోదు చేశారు.

News November 12, 2025

పిచ్చికుక్క దాడిలో గాయపడిన వారిని చోడవరం తరలింపు

image

వడ్డాదిలో <<18264743>>పిచ్చికుక్క <<>>దాడితో గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో చోడవరం CHCకి తరలించినట్లు డాక్టర్ రమ్య తెలిపారు. వడ్డాది PHCలో రేబీస్ వ్యాక్సినేషన్, ప్రథమ చికిత్స అనంతరం బాధితులను తరలించామన్నారు. కాగా పిచ్చికుక్క దాడిలో గాయపడిన వారి సంఖ్య 15కి చేరుకుంది. గాయపడిన వారు ఒక్కొక్కరు ఆసుపత్రికి వస్తున్నారు. పంచాయతీ అధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

News November 12, 2025

షాహీన్.. పనులతో పరేషాన్!

image

ఉగ్రకుట్ర కేసులో <<18257542>>అరెస్టైన<<>> డా.షాహీన్‌ దేశంలో జైషే మహ్మద్ ఉమెన్స్ వింగ్‌ను నడిపిస్తోంది. ఉగ్ర సంస్థ మహిళా విభాగం చీఫ్‌, జైషే ఫౌండర్ మసూద్ అజార్ సోదరి సాదియా అజార్‌తో షాహీన్‌కు నేరుగా సంబంధాలున్నట్లు గుర్తించారు. చీఫ్ ఆదేశాలతో ఆమె దేశంలో మహిళలకు బ్రెయిన్ వాష్ చేసి ఉగ్రవాదంలోకి దింపుతోంది. షాహీన్ అమాయకంగా, క్రమశిక్షణతో ఉండేదని 2009లో ఆమె పనిచేసిన కన్నౌజ్ మెడికల్ కాలేజీ అధికారులు చెప్పడం గమనార్హం.