News March 18, 2024
దేవేందర్ గౌడ్‌ను కలిసిన ఈటల, కొండా

మాజీ మంత్రి దేవేందర్ గౌడ్‌ను తుక్కుగూడలోని వారి నివాసంలో ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వేణుగోపాలచారి, అందెల శ్రీరాములు, కేఎస్ రత్నం, నరసింహరెడ్డి, విక్రమ్ రెడ్డి, పలువురు కౌన్సిలర్స్ కార్పొరేటర్లు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈటల, విశ్వేశ్వర్ రెడ్డి, పూలబొకే ఇచ్చి ఘనంగా సన్మానించారు. అనంతరం వారితో ముచ్చటించి వారి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు.
Similar News
News April 20, 2025
HYD: కూతురికి విషం ఇచ్చి తల్లి సూసైడ్ అటెంప్ట్

బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ప్రగతి నగర్లో విషాదం చోటుచేసుకుంది. 4 సంవత్సరాల కూతురు జేష్వికకు విషం ఇచ్చి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇద్దరినీ KPHBలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. చిన్నారి మృతి చెందగా ప్రస్తుతం తల్లికి చికిత్స అందిస్తున్నారు. అనారోగ్య సమస్యలతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
News April 20, 2025
HYD: ఫ్యాన్సీ నంబర్స్ వేలం ద్వారా భారీ ఆదాయం

ఫ్యాన్సీ నంబర్స్ వేలం ద్వారా తెలంగాణ రవాణాశాఖ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. శనివారం జరిగిన ఫ్యాన్సీ నంబర్ల వేలంలో ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ఒక్క రోజులోనే రూ.3.71 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం మొత్తం 50కు పైగా ఫ్యాన్సీ నంబర్లు వేలంలో అమ్మకమయ్యాయని ఆర్టీఏ అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా 9999, 0001, 6666, 7777 వంటి నంబర్లకు విపరీతమైన డిమాండ్ ఉందని తెలిపారు.
News April 20, 2025
HYD: పీహెచ్డీ కోర్సు వర్క్ పరీక్ష తేదీల ఖరారు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీహెచ్డీ కోర్స్ వర్క్ (ప్రీ పీహెచ్డీ) పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ప్రీ పీహెచ్డీ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలను ఈనెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్ సైట్లో చూసుకోవాలని సూచించారు.