News March 18, 2024

UPDATE.. బెంగళూరు నుంచి కాశీకి వెళ్తుండగా ప్రమాదం

image

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ జాతీయ రహదారిపై MSN పరిశ్రమ ముందు మారుతి ఈకో వ్యాన్ అదుపుతప్పి పక్కన చెట్టును ఢీకొనడంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ప్రమాదంలో మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరంతా బెంగళూరు నుంచి కాశీకి వెళ్తున్నట్లు సమాచారం.

Similar News

News July 3, 2024

గోల్కొండ దేవాలయ ఛైర్మన్‌గా అరవింద్ మహేశ్ కుమార్

image

చారిత్రాత్మక గోల్కొండ కోట శ్రీజగదాంబిక మహంకాళి దేవాలయ ఛైర్మన్‌గా అరవింద్ మహేశ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ దేవాదాయ శాఖ కమిషనర్ 14 మంది సభ్యులతో కూడిన బోనాల ఉత్సవాల కమిటీని ఏర్పాటు చేసి ఉత్తర్వులను జారీ చేశారు. సభ్యులందరూ అరవింద్ మహేశ్ కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బోనాల ఉత్సవాల కమిటీ సభ్యులుగా పలువురు నియమితులయ్యారు.

News July 3, 2024

HYD: 7 నుంచి అంధ అభ్యర్థులకు నిర్ధారణ పరీక్షలు

image

గ్రూప్-4 ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనలో భాగంగా అంధ అభ్యర్థులు వైద్య పరీక్షల నిమిత్తం హాజరు కావాల్సి ఉంటుందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి ఈ.నవీన్ నికోలస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అంధ అభ్యర్థులు ఈనెల 7వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మెహిదీపట్నం సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు ఎదుట ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.

News July 3, 2024

HYD: నీట్ పరీక్షను భేషరతుగా రద్దు చేయాలి: జాజుల

image

దేశ వ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షను భేషరతుగా రద్దు చేయాలని, నీట్ పరీక్ష పత్రం లీకేజీకి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం HYD సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నీట్ పరీక్ష విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల పక్ష విద్యార్థి సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.