News January 29, 2025
144 సెక్షన్ అమలు చేయాలి: అల్లూరి జేసీ

మార్చి 1నుంచి 15వతేదీ వరకు ఇంటర్ పబ్లిక్ పరీక్షలు జరగనున్నందున, పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జేసీ అభిషేక్ గౌడ అధికారులను బుధవారం ఆదేశించారు. పరీక్షలు అత్యంత పకడ్బందీగా నిర్వహించాలన్నారు. మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144సెక్షన్ అమలు చేయాలన్నారు. పరీక్షా కేంద్రం చుట్టుపక్కల జిరాక్స్ షాపులు మూసివేయించాలన్నారు.
Similar News
News September 17, 2025
ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక వైద్య శిబిరాలు: DMHO

మహిళల ఆరోగ్య సంరక్షణకు జిల్లాలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు బాపట్ల DMHO విజయమ్మ తెలిపారు. మంగళవారం వైద్య శిబిరాలకు సంబంధించి బాపట్లలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఆరోగ్యవంతమైన మహిళ.. శక్తివంతమైన కుటుంబం నినాదంతో జిల్లాలోని PHC, UPHCలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, వైద్యశాలల్లో శిబిరాలు నిర్వహిస్తామన్నారు. మహిళలు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News September 17, 2025
త్వరలో మహిళా పాలసీ ప్రకటిస్తాం: మంత్రులు

TG: త్వరలో మహిళా పాలసీ ప్రకటిస్తామని మంత్రులు సురేఖ, సీతక్క వెల్లడించారు. ‘కుటుంబ బాధ్యతలు, వృత్తి బాధ్యతల్లో మహిళలు నిత్యం ఒత్తిడులకు గురవుతున్నారు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం కూడా చూసుకోవాలి. మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఈనెల 22న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తాం. మహిళల సూచనలతో కొత్త మహిళా పాలసీని తీసుకొస్తాం’ అని సెక్రటేరియట్ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో పేర్కొన్నారు.
News September 17, 2025
హైదరాబాద్‌లో 50 మంది CIల బదిలీ

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇన్‌స్పెక్టర్ల బదిలీలు, పదోన్నతులు జరిగాయి. తాజాగా కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. 50 మంది ఇన్‌స్పెక్టర్లకు బదిలీ, పదోన్నతి ఇచ్చినట్లు వెల్లడించారు. చాలా రోజుల నుంచి ఒకే పోస్టింగ్‌లో ఉన్న వారిని సైతం ఇతర ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్ చేశారు.