News January 29, 2025
పార్వతీపురం ఫ్లైఓవర్‌పై యువకుడు మృతి

బైకు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు బుధవారం మృతి చెందాడు. ఈ ఘటన పార్వతీపురం ఫ్లైఓవర్‌పై చోటుచేసుకుంది. మృతుడు పార్వతీపురంలోని ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న సంతుగా గుర్తించారు. అతనిది బెలగాం అని ప్రమాదానికి గల కారణాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు.
Similar News
News July 5, 2025
వరంగల్: ముమ్మరంగా సాగుతున్న రేషన్ కార్డుల సర్వే

కొత్త రేషన్ కార్డుల కొరకు వచ్చిన దరఖాస్తులపై అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారు. వరంగల్ జిల్లాలో 14,087 దరఖాస్తులు రాగా, 5,667 దరఖాస్తులను ఇప్పటికే పరిశీలించారు. ఆయా గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాల్లో సర్వే నిర్వహిస్తున్నారు. సర్వే పూర్తయిన అనంతరం నూతన రేషన్ కార్డులు మంజూరు కానున్నాయి. సుమారు 12 ఏళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులు మంజూరు కానుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News July 5, 2025
వరంగల్: రాష్ట్రంలోనే తొలి గిరిజన బతుకమ్మ తల్లి విగ్రహం మనదే!

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని పెద్ద తండాలో రాష్ట్రంలోనే తొలిసారిగా గిరిజన బతుకమ్మ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహ ఏర్పాటుకు తండాకు చెందిన లూనావత్ భిక్ష్య నాయక్ ఆర్థిక సహాయం అందించగా ఇటీవల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తమ తండాల్లో ఇలాంటి గిరిజన బతుకమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించినందుకు గాను పలువురు గిరిజనులు వారిని అభినందిస్తున్నారు. స్థానికులు విగ్రహాన్ని ఆసక్తిగా తిలకిస్తున్నారు.
News July 5, 2025
మరో రెండు రోజులు గోదావరి వరద ఉద్ధృతి

గోదావరిలో వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. మరో రెండు రోజులు వరద ప్రవాహం ఇదే తరహాలో ఉంటుందని గోదావరి హెడ్ వర్క్స్ ఈఈ శ్రీనివాస్ తెలిపారు. సీలేరుతో కలిపి శనివారం గోదావరి ఇన్‌ఫ్లో 1,70,929 క్యూసెక్కుల నీరు వస్తుందన్నారు. 3 డెల్టాలకు సాగునీటి అవసరాల నిమిత్తం 12,100 క్యూసెక్కులు విడిచిపెడతామన్నారు. మిగిలిన 1,60,218 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదలనున్నట్లు వివరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.