News March 18, 2024
UPDATE.. బెంగళూరు నుంచి కాశీకి వెళ్తుండగా ప్రమాదం

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ జాతీయ రహదారిపై MSN పరిశ్రమ ముందు మారుతి ఈకో వ్యాన్ అదుపుతప్పి పక్కన చెట్టును ఢీకొనడంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ప్రమాదంలో మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరంతా బెంగళూరు నుంచి కాశీకి వెళ్తున్నట్లు సమాచారం.
Similar News
News January 9, 2026
HYD: రూ.40K సాలరీతో ఉద్యోగాలు

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ECIL) కాంట్రాక్టు పద్ధతిలో HYDలో ప్రాజెక్ట్ ఇంజినీర్‌లను నియమించనుంది. B.Tech/ B.E పూర్తి చేసి, 3ఏళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులు అర్హులు. నెలకు ₹40,000 జీతంతో ఏడాది కాంట్రాక్టుతో ప్రారంభమై, 4 ఏళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంది. దరఖాస్తులు జనవరి 6- 20 వరకు స్వీకరిస్తారు. మరిన్ని వివరాలకు <
News January 9, 2026
డీజీపీ శివధర్‌రెడ్డి నియామకంపై ఇవాళ హైకోర్టు తీర్పు

డీజీపీ శివధర్‌రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ ఉత్తర్వులు వెలువరించనున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. డీజీపీ నియామకం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని పిటిషనర్ వాదించారు. ప్రభుత్వం జాబితాను ఆలస్యంగా పంపడంతో యూపీఎస్సీ తిరిగి పంపిందని కోర్టుకు తెలియజేశారు. వాదనలు విన్న అనంతరం ధర్మాసనం విచారణను నేటికి వాయిదా వేసింది.
News January 9, 2026
FLASH: HYDలో బస్సు బోల్తా

సినిమా షూటింగ్‌కు వెళ్తున్న బస్సు పెద్దఅంబర్‌పేట్‌లో బోల్తా కొట్టింది. హయత్‌నగర్ సీఐ నాగరాజు గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం నుంచి మణికొండకు వస్తున్న బస్సు పెద్ద అంబర్‌పేట్ ఫ్లైఓవర్ స్టార్టింగ్‌లో డివైడర్‌ని ఢీకొట్టి బోల్తా కొట్టింది. డ్రైవర్ విజయ భాస్కర్ రెడ్డి, నర్సిరెడ్డి, ఎలక్ట్రిషన్, డ్రైవర్ విజయ్‌లకు గాయాలయ్యాని తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


