News January 29, 2025
జగిత్యాల: ఇంటర్ ప్రాక్టికల్స్ సజావుగా జరిగేలా చూడాలి: అడిషనల్ కలెక్టర్

ఫిబ్రవరి 3 నుంచి జరగనున్న ఇంటర్ ప్రాక్టికల్స్ సజావుగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వివిధ డిపార్ట్మెంట్స్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్‌తో బుధవారం జరిగిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన సహాయ సహకారాలు వివిధ శాఖల అధికారులు అందించాలని పరీక్షల కన్వీనర్ నారాయణ కోరారు. కన్వీనర్ కోరినట్లు అన్ని ఏర్పాట్లు చేయాలని అడిషనల్ కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News July 5, 2025
HYD: GHMC వెబ్‌సైట్‌లో ఈ సదుపాయాలు

ఆస్తి పన్నుకు సంబంధించి ప్రజల సౌకర్యార్థం కొన్ని సదుపాయాలను GHMC వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చినట్లు అడిషనల్ కమిషనర్ అనురాగ్ జయంతి తెలిపారు. ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్ మెంట్, రివిజన్, వేకెన్సీ రెమిషన్, యజమాని పేరు కరెక్షన్, డోర్ నెంబర్ కరెక్టన్, అసెస్ మెంట్ మినహాయింపు, ప్రాపర్టీ టాక్స్ సెల్ఫ్ అసెస్మెంట్ ఉన్నాయన్నారు. ప్రజలు ఈ సదుపాయాలను వినియోగించుకోవాలని కోరారు.
News July 5, 2025
సిరిసిల్ల: కుటుంబాన్ని నిండా ముంచిన సోది చెప్పేవాడు

కొడుకును బాగు చేస్తామని మాయమాటలు చెప్పి బంగారం ఎత్తుకెళ్లిన సంఘటన వీర్నపల్లి మం. అడవిపదిరలో శుక్రవారం జరిగింది. SI లక్ష్మణ్ వివరాల ప్రకారం.. చింతల్‌టాన లక్ష్మి తన కొడుకు బాగు కోసం సొది చెప్పేవాడి మాయమాటలు నమ్మి కూతురి ఒంటి మీద ఉన్న బంగారం తీసి బియ్యంలో పెట్టింది. ఇదే అదనుగా సోది చెప్పే వ్యక్తి నగలను తీసుకొని పరారయ్యాడు. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. దర్యాప్తు జరుగుతోంది.
News July 5, 2025
DANGER.. బ్లూటూత్ వాడుతున్నారా?

బ్లూటూత్ ఆధారంగా పనిచేసే స్పీకర్లు, బడ్స్, హెడ్ ఫోన్స్ వాడే వారిని ఇండియన్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించింది. ‘హ్యాకర్లు బ్లూటూత్ ద్వారా ఆడియో పరికరాలను నియంత్రణలోకి తీసుకునే అవకాశముంది. సంభాషణలపై నిఘా పెట్టి, కాల్‌ను హైజాక్ చేసే ఛాన్సుంది. పెద్ద బ్రాండ్లు వాడుతున్నా ప్రమాదమే. కాల్ డేటా, కాంటాక్టులను దోచేసే ప్రమాదముంది. కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో బ్లూటూత్ వాడకుండా ఉండండి’ అని సూచించింది.