News January 29, 2025
MAHAKUMBH MELA: రూ.25లక్షల చొప్పున పరిహారం

ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట మృతుల కుటుంబాలకు యూపీ సర్కార్ నష్ట పరిహారం ప్రకటించింది. 30 కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇవాళ మౌని అమావాస్య సందర్భంగా త్రివేణీ సంగమంలో స్నానం చేసేందుకు అధిక సంఖ్యలో భక్తులు రాగా అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత తొక్కిసలాట జరిగింది. ఘటనలో 30 మంది చనిపోగా, 60 మందికి గాయాలైన విషయం తెలిసిందే.
Similar News
News January 26, 2026
అలాంటి రేప్ కేసులు చెల్లవు: హైకోర్టు

వెస్ట్రన్ కల్చర్ ప్రభావంతో యువతలో లివ్ ఇన్ రిలేషన్‌షిప్ ధోరణి పెరిగిందని అలహాబాద్ హైకోర్టు అభిప్రాయపడింది. బ్రేకప్ తర్వాత మహిళల అత్యాచార ఆరోపణలతో పురుషులపై FIRలు నమోదవుతున్నాయని పేర్కొంది. కిడ్నాప్, రేప్ కేసు ఎదుర్కొంటున్న వ్యక్తికి దిగువకోర్టు విధించిన జీవిత ఖైదును రద్దు చేసింది. బాధితురాలు ఇష్టపూర్వకంగా అతడితో వెళ్లినందున ఆరోపణలు చెల్లవని, పైగా ఆ సమయంలో ఆమె మేజర్ అని స్పష్టం చేసింది.
News January 26, 2026
16వేల ఉద్యోగాలు ఊస్ట్.. రేపటి నుంచే షురూ!

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారీ ఎత్తున ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. మొత్తం 30 వేల మంది తొలగింపు ప్రక్రియలో భాగంగా రేపటి నుంచి రెండో విడతలో 16,000 మందిని తొలగించనుంది. ఇప్పటికే గత అక్టోబర్‌లో 14 వేల మందిని ఇంటికి పంపగా తాజా నిర్ణయంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. 2023లోనూ 27 వేల మందిని తొలగించిన అమెజాన్, ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో మళ్లీ లేఆఫ్స్ బాట పట్టడం ఐటీ రంగంలో కలకలం రేపుతోంది.
News January 26, 2026
తెలుగు రాష్ట్రాల్లో ఎట్ హోం.. హాజరైన ప్రముఖులు

తెలుగు రాష్ట్రాల లోక్‌భవన్‌లలో ‘ఎట్ హోం’ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. AP గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఇచ్చిన తేనీటి విందుకు CM చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్ సహా కీలక నేతలు, ప్రముఖులు హాజరయ్యారు. ఇటు TGలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో Dy.CM భట్టి సహా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురికి ఎక్సలెన్స్ అవార్డులు ఇచ్చారు.


