News January 29, 2025
ఈ సెంచరీ వారిద్దరికి అంకితం: త్రిష

అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్‌లో నమోదు చేసిన సెంచరీని తన అమ్మనాన్నకు అంకితమిస్తున్నట్లు భారత ప్లేయర్ త్రిష తెలిపారు. నాన్న ముందే సెంచరీ చేయడం చాలా ప్రత్యేకంగా ఉందన్నారు. తాను 20 ఓవర్లు బ్యాటింగ్ చేయాలనే పట్టుదలతో ఇన్నింగ్సు ఆడినట్లు తెలిపారు. గత WCలోనే సెంచరీ చేయాలని అనుకున్నా ఇప్పటికి కుదిరిందని పేర్కొన్నారు. టీమ్ ఇండియా మాజీ ప్లేయర్ మిథాలీ రాజ్ తనకు ఐడల్ అని చెప్పుకొచ్చారు.
Similar News
News March 15, 2025
అప్పటివరకు రోహిత్ శర్మనే కెప్టెన్?

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ వరకు భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ కొనసాగుతారని తెలుస్తోంది. ఆ తర్వాత కెప్టెన్సీ మార్పు ఉంటుందని బీసీసీఐ వర్గాల సమాచారం. దీనిపై బీసీసీఐ కూడా ఇప్పటికే ఫిక్స్ అయిందని టాక్. కాగా గతేడాది ఆస్ట్రేలియాలో జరిగిన BGTలో భారత్ పేలవ ప్రదర్శన చేసింది. రోహిత్ సారథ్యంలో టీమ్ ఇండియా 1-3 తేడాతో చిత్తుచిత్తుగా ఓడింది. దీంతో కెప్టెన్‌ను మార్చాలని డిమాండ్లు వినిపించాయి.
News March 15, 2025
డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం?

US అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 41 దేశాలకు పైగా ప్రజలకు ప్రయాణ ఆంక్షలు విధించాలని ఆయన భావిస్తున్నట్లు రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది. దాని ప్రకారం.. అఫ్ఘాన్, పాకిస్థాన్, భూటాన్, మయన్మార్ వంటి అనేక దేశాలు ఆ జాబితాలో ఉన్నాయి. అయితే దీనిపై ఇంకా పూర్తి స్థాయి ఆమోదం రాలేదని, జాబితాలో స్వల్ప మార్పులు ఉండొచ్చని శ్వేతసౌధ వర్గాలు తెలిపినట్లు రాయిటర్స్ పేర్కొంది.
News March 15, 2025
పాక్‌కు బిగ్ షాక్: 214 సైనికుల్ని చంపేసిన BLA

పాకిస్థాన్‌కు చావుదెబ్బ తగిలింది. జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసి బంధించిన 214 మంది సైనికులను బలూచ్ లిబరేషన్ ఆర్మీ చంపేసింది. ‘యుద్ధ ఖైదీలను విడుదల చేయాలని పాక్ ఆర్మీకి 48hrs గడువిచ్చాం. వారి జవాన్లను రక్షించుకొనేందుకు ఇచ్చిన ఆఖరి అవకాశాన్ని పొగరుతో కాలదన్నారు. క్షేత్ర పరిస్థితుల్ని పట్టించుకోలేదు. అందుకే 214 మందిని హతమార్చాం. మా 12మంది అమర వీరులకు నివాళి అర్పిస్తున్నాం’ అని BLA ప్రకటించింది.