News January 29, 2025

BREAKING: ఏపీకి కొత్త డీజీపీ

image

AP కొత్త డీజీపీగా హరీశ్ గుప్తాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీకాలం ఈ నెల 31వ తేదీతో ముగియనుండటంతో హరీశ్ గుప్తాను నియమించింది. కాగా ఎన్నికల సమయంలోనూ హరీశ్ డీజీగా బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం విజిలెన్స్ డీజీగా ఉన్నారు.

Similar News

News December 26, 2025

రింకూ సింగ్ సెంచరీ

image

విజయ్ హజారే ట్రోఫీలో UP కెప్టెన్ రింకూ సింగ్ అదరగొట్టారు. చండీగఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 56 బంతుల్లోనే సెంచరీ చేశారు. ఆర్యన్ జుయల్ (134) కూడా చెలరేగడంతో UP 50 ఓవర్లలో 367/4 పరుగుల భారీ స్కోరు చేసింది. మరోవైపు గుజరాత్‌తో మ్యాచ్‌లో కోహ్లీ(77), పంత్(70) హాఫ్ సెంచరీలతో ఢిల్లీ 254/9 స్కోరు చేసింది. ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ విఫలమైనా హార్దిక్ తమోర్(93) రాణించడంతో ముంబై 331/7 కొట్టింది.

News December 26, 2025

పీరియడ్స్‌లో వీటికి దూరంగా ఉండండి

image

పీరియడ్స్ సమయంలో వాకింగ్, యోగా వంటి తక్కువ ప్రభావమున్న వ్యాయామాలు చేయవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. కానీ, అధిక బరువులు ఎత్తడం, రన్నింగ్, దూకడం, వంటి శరీరంపై అధిక ప్రభావం చూపించే వ్యాయామాలు చేయకూడదని సూచిస్తున్నారు. ముఖ్యంగా కార్డియో, ఓవర్‌హెడ్ , క్రంచెస్, స్క్వాట్స్ వంటి వ్యాయామాలు చేయకూడదని చెబుతున్నారు. వీటివల్ల శరీరంపై ఒత్తిడి పెరిగి ఎక్కువ బ్లీడింగ్ అయ్యేఅవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

News December 26, 2025

మిరపలో పూత పురుగును ఎలా నివారించాలి?

image

మిరప పూత మొగ్గలపై ఈ మొగ్గలు గుడ్లు పెడతాయి. వీటి నుంచి బయటకు వచ్చిన చిన్న లార్వాలు పూలలోని అండాశయాన్ని తొలిచి తింటాయి. దీని వల్ల అండాశయం తెల్లగా మారి ఉబ్బుతుంది. మొగ్గలు విచ్చుకోకుండ రాలిపోతాయి. పిందే దశలో కాయలు గిడసబారి గింజలు లేకుండా త్వరగా పండుబారి విపరీతంగా రాలిపోతాయి. పూత పురుగును నివారించడానికి లీటరు నీటికి Tolfenpyrad అనే మందు 2mlను కలిపి పిచికారీ చేసుకోవాలి.