News January 29, 2025

సిద్దిపేట: నిఘా నీడలో ప్రాక్టికల్స్: రవీందర్

image

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు నిఘా నీడన పకడ్బందీగా జరగనున్నాయని ఇంటర్మీడియట్ అధికారి రవీందర్ అన్నారు. పరీక్షల నిర్వహణ సందర్భంగా జిల్లాలోని అన్ని కళాశాలల ప్రిన్సిపల్స్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 3 నుంచి 28 వరకు 4 విడతలుగా జరిగే ఈ పరీక్షల నిర్వహణ కోసం ఈ సంవత్సరం అన్ని ప్రయోగశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Similar News

News November 10, 2025

నేటి నుంచి గ్రూప్-3 అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్

image

TG: నేటి నుంచి ఈ నెల 26 వరకు HYDలోని సురవరం ప్రతాప్ రెడ్డి(పొట్టి శ్రీరాములు) యూనివర్సిటీలో గ్రూప్-3 మెరిట్ అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగనుంది. రోజూ 10:30am నుంచి 5.30pm వరకు కొనసాగనుంది. మొత్తం 1,365 పోస్టుల భర్తీకి గత ఏడాది నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మెరిట్ జాబితా విడుదలైంది. TGPSC <>వెబ్‌సైట్‌లో<<>> అధికారులు పూర్తి వివరాలను అందుబాటులో ఉంచారు.

News November 10, 2025

విశాఖ: హ్యూమన్ ట్రాఫికింగ్.. ఇద్దరి అరెస్ట్

image

రైలులో పసి పిల్లలను భిక్షాటన చేయించే గ్యాంగ్‌ను వాల్తేరు RPF/CPDS బృందం పట్టుకుంది. ఆపరేషన్ యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్‌లో భాగంగా చేసిన దాడిలో ఐదుగురు చిన్నారులను రక్షించి, ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు. సుధా కుమారి అలియాస్ శాంత, సుఖ్ బాయి ధడి చిన్నారులను ఛత్తీస్‌గఢ్‌ నుంచి డబ్బు ప్రలోభాలతో విశాఖకు తీసుకువచ్చినట్టు విచారణలో తెలింది. కేసు GRP/విశాఖలో నమోదు చేశారు. అనంతరం ఖరోరా PSకు బదిలీ చేశారు.

News November 10, 2025

NLG: MGUకి అరుదైన గౌరవం

image

MGUకి అరుదైన గౌరవం దక్కింది. ఇక్కడ జారీ చేసే వివిధ కోర్సుల సర్టిఫికెట్లకు ‘నేషనల్‌ అకడమిక్‌ డిపాజిటరీ’ స్కీమ్‌లో స్థానం లభించింది. ఇక్కడ జారీ చేసే సర్టిఫికెట్లను ఎక్కడైనా చూసుకునే అవకాశం కలుగుతుందని, దీంతో నకిలీ సర్టిఫికెట్లను ఈజీగా గుర్తించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. విద్యార్థులు తమ సర్టిఫికెట్లు పొందేలా వర్సిటీ వెబ్‌సైట్‌లో డిజీలాకర్‌/ఎన్‌ఏడీ పోర్టల్‌ను అందుబాటులో ఉంచారు.