News March 18, 2024

నాలుగు నెలల మనవడికి మూర్తి రూ.240కోట్లు గిఫ్ట్!

image

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఆయన నాలుగు నెలల మనవడికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారు. సంస్థలో ఆయనకున్న వాటా నుంచి 0.04%, అంటే 15,00,000 షేర్లను మనవడు ఏకగ్రహ రోహన్ మూర్తికి కానుకగా ఇచ్చారు. వీటి విలువ రూ.240కోట్లపైనే! దీంతో ప్రస్తుతం మూర్తి షేర్లు 0.40% నుంచి 0.36శాతానికి తగ్గాయి. కాగా గత ఏడాది నవంబరులో నారాయణమూర్తి కుమారుడు రోహన్ మూర్తి-అపర్న కృష్ణన్ దంపతులు ఏకగ్రహకు జన్మనిచ్చారు.

Similar News

News January 9, 2025

బ్రేక్‌ఫాస్ట్ ఏ సమయంలో తింటున్నారు?

image

కొందరు ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి బద్ధకిస్తుంటారు. కానీ ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 7 నుంచి 8 గంటల సమయంలో అల్పాహారం తీసుకోవాలి. ఉదయం 9 గంటల తర్వాత తినకూడదు. ఇలా చేస్తే డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది. ఆలస్యంగా టిఫిన్ చేస్తే గుండెజబ్బుల బారిన పడే అవకాశం ఉంది. జీవక్రియకు కూడా ఆటంకం కలుగుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌కు, లంచ్‌కు కనీసం 4 గంటల గ్యాప్ ఉండాలి.

News January 9, 2025

హనీరోజ్‌ను వేధించిన బిజినెస్‌మ్యాన్ అరెస్ట్

image

హీరోయిన్ హనీరోజ్‌ను <<15073430>>వేధించిన<<>> ప్రముఖ బిజినెస్‌మ్యాన్ బాబీ చెమ్మనూర్‌ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వయనాడ్‌లో ఆయనను అదుపులోకి తీసుకుని నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాబీ గతంలో హనీరోజ్‌ను కొన్ని ఈవెంట్లకు ఆహ్వానించారు. కానీ ఆమె వాటికి హాజరుకాకపోవడంతో సోషల్ మీడియాలో కించపరిచేలా పోస్టులు పెట్టారు. దీనిపై హనీ రోజ్ ఎర్నాకుళం పీఎస్‌లో ఫిర్యాదు చేయగా అతడిని అరెస్ట్ చేశారు.

News January 9, 2025

ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఉంటాయి: ప్రభుత్వం

image

AP: ఇంటర్ <<15096013>>ఫస్టియర్ పరీక్షల<<>> రద్దుపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ ఏడాది మార్చిలో జరిగే పబ్లిక్ పరీక్షల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. ఫస్టియర్ పరీక్షలు కాలేజీలు నిర్వహించి, సెకండియర్ ఎగ్జామ్స్ బోర్డు నిర్వహించాలన్నది ప్రతిపాదనే అని తెలిపింది. జనవరి 26 వరకు విద్యార్థులు, తల్లిదండ్రుల సలహాలు, సూచనలు తీసుకుంటామని, ఆ తర్వాత తుది నిర్ణయం వెల్లడిస్తామని పేర్కొంది.