News March 18, 2024
ఇది యూకేజీ ఫీజా.. ఆస్తులు అమ్మాల్సిందే!

పిల్లల్ని కిండర్‌గార్టెన్(కేజీ) చదివించాలంటే సాధారణంగా ఎంత ఖర్చు అవుతుంది? మహా అయితే ఏడాదికి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఉండొచ్చు. అంతేకదా..? కానీ ఓ పాఠశాలలో మాత్రం అక్షరాలా రూ.2,72,718 కట్టాల్సి ఉంటుంది. అందులో రూ.33వేలు తర్వాత రిఫండ్ ఇస్తారట. దీనికి సంబంధించి ఓ ఫొటో వైరల్ అవుతోంది. ‘ఇది యూకేజీ ఫీజా..? పిల్లల్ని ఇలా చదివించాలంటే మా ఆస్తులు అమ్మాల్సిందే’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News October 27, 2025
సీఎంతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ

AP: రాష్ట్రానికి మొంథా తుఫాను ముప్పు ఉన్న నేపథ్యంలో CM CBNతో PM మోదీ ఫోనులో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం PMOతో సమన్వయం చేసుకోవాలని మంత్రి లోకేశ్‌కు CM సూచించారు. వర్షాలు, వరదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కాల్వ గట్లు పటిష్ఠం చేసి పంట నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. ఈ మేరకు నిర్వహించిన సమీక్షలో మంత్రులు లోకేశ్, అనిత, CS తదితరులు పాల్గొన్నారు.
News October 27, 2025
మొదటి అడుగు సులభం కాదు.. కానీ: ఆనంద్

ఎన్నో అడ్డంకులను అధిగమించి తవాంగ్‌కు చెందిన టెన్జియా యాంగ్కీ IPSలో చేరిన తొలి అరుణాచల్‌ప్రదేశ్ మహిళగా చరిత్ర సృష్టించారు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన ఆమె ప్రయాణాన్ని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. ‘మొదటి వ్యక్తి కావడం ఎప్పుడూ సులభం కాదు. ఆమె వేసిన గెలుపు బాటలో ఎంతో మంది యువతులు పయనిస్తారు’ అని కొనియాడారు. ఇది తన ‘Monday Motivation’ అని రాసుకొచ్చారు.
News October 27, 2025
పరకామణి కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు

AP: తిరుమల పరకామణి కేసును సీఐడీతో దర్యాప్తు చేయించాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అలాగే నిందితుడు రవిపై ఏసీబీతో ఇన్వెస్టిగేషన్ చేయించాలని, ఆయన కుటుంబ ఆస్తులను పరిశీలించి సీల్డ్ కవర్‌లో నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 2కు వాయిదా వేసింది.


