News January 30, 2025

ఢిల్లీ ప్రజలను రక్షించేందుకే నా ప్రయత్నం: కేజ్రీవాల్

image

యమునా జలాల్లో హరియాణా విషం కలిపిందన్న AAP అధినేత కేజ్రీవాల్ వ్యాఖ్యలపై EC సీరియస్ అయి షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ ఆ నోటీసులకు వివరణ ఇస్తూ.. యమునా జలాల విషయంలో తన వాదనలపై EC దర్యాప్తు చేయాలన్నారు. ఢిల్లీ ప్రజలను రక్షించేందుకే తన ప్రయత్నం అని చెప్పారు. కేజ్రీ వ్యాఖ్యల నేపథ్యంలో తాను యమునా నీళ్లే తాగుతానని PM మోదీ, నది వద్దకు వెళ్లి హరియాణా CM నీళ్లు తాగి కౌంటర్ ఇచ్చారు.

Similar News

News November 3, 2025

WWC-2025 ‘లీడింగ్’ రికార్డులు

image

☞ అత్యధిక వికెట్లు-22(దీప్తి శర్మ-భారత్)
☞ సిక్సర్లు- 12(రిచా ఘోష్-భారత్)
☞ పరుగులు- 571(లారా-దక్షిణాఫ్రికా)
☞ వ్యక్తిగత స్కోరు- 169(లారా)
☞ సెంచరీలు-2(లారా, గార్డ్‌నర్, హేలీ)
☞ అర్ధసెంచరీలు-3(లారా, దీప్తి శర్మ)
☞ అత్యధిక ఫోర్లు-73(లారా)
☞ ఈ టోర్నీలో భారత్ తరఫున మంధాన, ప్రతీకా, రోడ్రిగ్స్ సెంచరీలు చేశారు.

News November 3, 2025

రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు

image

AP: కల్తీ మద్యం కేసులో అరెస్టైన మాజీ మంత్రి జోగి రమేశ్, ప్రధాన నిందితుడు జనార్దన్ రావు మధ్య సంబంధాలు ఉన్నాయని సిట్ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మొదట ములకలచెరువులో మద్యం తయారీ ప్రారంభించాలని రమేశ్ మంత్రిగా ఉన్నప్పుడే జనార్దన్ రావుకు సూచించారని తెలిపారు. కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు తొలుత ములకలచెరువు, ఆ తర్వాత ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యంపై హడావుడి చేశారని వివరించారు.

News November 3, 2025

పాపికొండల బోటింగ్ షురూ

image

AP: పాపికొండల బోటింగ్ మళ్లీ మొదలైంది. పోలవరం ప్రాజెక్టు సమీపంలోని గండిపోచమ్మ వద్ద నిన్న రెండు బోట్లలో 103 మంది పర్యాటకులు బోటులో షికారుకెళ్లారు. వాస్తవానికి దీపావళికి ముందే ఈ బోటింగ్ ప్రారంభమైనప్పటికీ భారీ వర్షాలు, వరదలతో నిలిచిపోయింది. తాజాగా సాధారణ వాతావరణం ఉండటంతో అధికారులు అనుమతిచ్చారు. కార్తీక మాసం కావడంతో తిరిగి పర్యాటకుల తాకిడి పెరగనుంది.