News January 30, 2025

పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు నిర్వహించాలి: కలెక్టర్ 

image

జిల్లాలో మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్మీడియేట్ థియరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని 55 పరీక్షా కేంద్రాల్లో మార్చి 1వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ వరకు ఉదయం 9 గం. నుంచి మధ్యాహ్నం 12 గం. వరకు పరీక్షలు నిర్వహిస్తున్నామని, పరీక్షలకు 33,511 మంది విద్యార్ధులు హాజరుకానున్నట్లు చెప్పారు.

Similar News

News December 29, 2025

భారత్ తరఫున ఆడిన కబడ్డీ ప్లేయర్‌పై పాక్ నిషేధం

image

భారత్ తరఫున ఆడిన కబడ్డీ ప్లేయర్ ఉబైదుల్లా రాజ్‌పుత్‌పై పాకిస్థాన్ చర్యలు తీసుకుంది. ఈ విషయంపై అత్యవసరంగా సమావేశమైన పాక్ కబడ్డీ సమాఖ్య అతడిపై నిరవధికంగా నిషేధం విధించింది. తమ నుంచి NOC లెటర్ తీసుకోలేదని, ఎవరి అనుమతీ అడగకుండా టోర్నమెంట్‌లో పాల్గొన్నాడని చెప్పింది. కాగా బహ్రెయిన్‌లో జరిగిన ఓ <<18606414>>టోర్నీలో<<>> ఇండియన్ జెర్సీ, జెండాతో ఉబైదుల్లా కనిపించడం వివాదాస్పదమైంది.

News December 29, 2025

పశువుల్లో పాల ఉత్పత్తిని పెంచే పశుగ్రాసాలివి

image

పాడి పశువుల పోషణలో, పాల ఉత్పత్తిలో పచ్చి పశుగ్రాసానిది కీలక పాత్ర. అధిక పోషకాలు, మాంసకృత్తులతో కూడిన గడ్డి వల్ల జీవాల్లో వ్యాధి నిరోధకశక్తి, పాల ఉత్పత్తి పెరుగుతుంది. అందుకే దాణాతో పాటు ఎండు, పచ్చి గడ్డిని పశువులకు అందించాలి. పాడి పోషణలో ప్రసిద్ధి చెందిన 4G బుల్లెట్ సూపర్ నేపియర్, సూపర్ నేపియర్, హెడ్జ్ లూసర్న్, జూరీ గడ్డిని ఎలా పెంచాలి? వీటితో లాభమేంటో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News December 29, 2025

రైలు అగ్ని ప్రమాదంలో ఒకరు మృతిచెందడం బాధాకరం: హోంమంత్రి

image

ఎలమంచిలి వద్ద ఎర్నాకులం ట్రైన్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఒకరు మృతిచెందడం బాధాకరమని హోంమంత్రి వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం తెలిసిన వెంటనే ఆమె అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మృతులు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.