News January 30, 2025
JAN 31న పాఠశాలలకు సెలవు :ASF కలెక్టర్

నాగోబా జాతర సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈనెల 31వ తేదీన సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31వ తేదీన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ జాతరకు పిల్లలు వెళ్లాలని ఆయన కోరారు.ఇందుకు బదులుగా మార్చి 8వ తేదీ 2వ శనివారం రోజు పాఠశాలలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News July 11, 2025
అల్లూరి: ‘రూ.1,000 కోట్లతో అభివృద్ధి’

పాడేరు కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన సమీక్షలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మండలానికి 100 గోకులాల ఏర్పాటు, ROFR పట్టాల పంపిణీ, గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవల విస్తరణపై చర్యలు తీసుకోవాలని సూచించారు. బంగారు కుటుంబం కార్యక్రమంలో భాగంగా పది కుటుంబాలకు స్వయంగా మార్గదర్శిగా నిలిచారు. ఆర్గానిక్ వ్యవసాయం, పర్యాటక అభివృద్ధి, రూ.1000 కోట్లతో రహదారి, ప్రాజెక్టుల అభివృద్ధి వంటి అంశాలపై చర్చించారు.
News July 11, 2025
ఎచ్చెర్ల: దారుణంగా హత్య చేశారు

ఎచ్చెర్ల మండలంలో గోపి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. శుక్రవారం మధ్యాహ్నం ఫరీద్ పేట గ్రామ జంక్షన్ సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు గోపిపై అతి కిరాతకంగా దాడి చేసి చంపేశారని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News July 11, 2025
తుది శ్వాస వరకు సనాతన ధర్మం కోసం పనిచేస్తా: రాజాసింగ్

TG: తన <<17030713>>రాజీనామాను<<>> BJP ఆమోదించడంపై రాజాసింగ్ స్పందించారు. ‘ప్రజా సేవ చేసేందుకు, హిందుత్వాన్ని కాపాడేందుకు 11yrs క్రితం BJPలో చేరాను. నన్ను నమ్మి 3 సార్లు MLA టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. TGలో BJP ప్రభుత్వం రావాలని కార్యకర్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వారి బాధేంటో ఢిల్లీ పెద్దలకు అర్థమయ్యేలా చెప్పలేకపోయానేమో. తుది శ్వాస వరకు సనాతన ధర్మాన్ని రక్షించేందుకు పనిచేస్తా’ అని ట్వీట్ చేశారు.