News January 30, 2025

విజ్ఞాన శాస్త్రాన్ని ప్రయోగాత్మకంగా బోధించాలి:జిల్లా కలెక్టర్

image

విద్యార్థులకు విజ్ఞాన శాస్త్రాన్ని ఆచరణాత్మక విధానం ద్వారా బోధిస్తే సులువుగా పట్టు సాధిస్తారని.. బాగా గుర్తు ఉండిపోతుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ప్రత్యేక నిధులతో కొనుగోలు చేసిన 116 సైన్స్ ఫెయిర్ కిట్లను ప్రభుత్వ పాఠశాలలకు కలెక్టర్ అందజేశారు. ఈ కిట్లను టీచర్లు సద్వినియోగం చేసుకొని విద్యార్థులకు ప్రయోగాత్మక విధానంలో బోధించాలన్నారు.

Similar News

News July 6, 2025

పోలీసు శాఖలో 2, 844 కేసులు రాజీ: ఎస్పీ

image

ఏలూరు జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన మెగా లోక్ అదాలత్‌లో పోలీస్ శాఖకు సంబంధించిన 2,844 కేసులు రాజీ అయ్యాయని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదివారం తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. 827 IPC కేసులు, 417 స్పెషల్ అండ్ లోకల్ లాస్ కేసులు, 143 ఎక్సైజ్ కేసులు, 1, 454 పెట్టీ కేసులు (చిన్నపాటి చట్టపరమైన నేరాలు)తో మొత్తం 2, 844 కేసులు రాజీ అయ్యాయన్నారు.

News July 6, 2025

WGL: రేపు వరంగల్ మార్కెట్ ప్రారంభం

image

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున:ప్రారంభం కానుంది. నిన్న, ఈరోజు వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో సోమవారం ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులకు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.

News July 6, 2025

ఆ చిన్నారే ఇప్పుడు హీరోయిన్‌గా ఎంట్రీ..

image

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్’ ఫస్ట్ <<16964615>>గ్లింప్స్<<>> తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా సారా అర్జున్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈమె ఎవరో కాదు చియాన్ విక్రమ్ ‘నాన్న’ సినిమాలో నటించిన చిన్నారి. బాలనటిగా పలు తమిళ, మలయాళ చిత్రాల్లో నటించారు. దీంతో పాటు యాడ్స్‌లోనూ మెరిశారు. హీరోయిన్‌గా తొలి సినిమానే స్టార్ సరసన నటించే ఛాన్స్ కొట్టేశారు. ఆమె నాన్న రాజ్ అర్జున్ కూడా నటుడే.