News January 30, 2025

నేటిలోగా దరఖాస్తులు ఆన్‌లైన్‌ చేయాలి: భద్రాద్రి కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల దరఖాస్తుల పరిశీలన త్వరితగతిన పూర్తి చేయాలని బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. సంక్షేమ పథకాల అమలు, పీఎం కుసుమ్ పథకం, వేసవిలో నీటి కొరత రాకుండా తీసుకోవాల్సిన చర్యలు, ప్లాంటేషన్‌పై సమీక్ష నిర్వహించారు. ఇంకా ఆన్‌లైన్లో నమోదు కానీ సంక్షేమ పథకాల దరఖాస్తులను గురువారం వరకు పూర్తి చేయాలన్నారు.

Similar News

News January 13, 2026

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో తగ్గిన చలి తీవ్రత..!

image

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో గత నాలుగు రోజులుగా చలి తీవ్రత గణనీయంగా తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో అమ్రాబాద్‌లో అత్యల్పంగా 16.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. బల్మూరులో 16.6, నాగర్‌కర్నూల్‌లో 16.8, లింగాల, తెలకపల్లిలో 17.1 డిగ్రీల చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరగడంతో ప్రజలకు చలి నుంచి ఉపశమనం లభించింది.

News January 13, 2026

రేపటి నుంచి ఉమామహేశ్వర బ్రహ్మోత్సవాలు

image

అచ్చంపేట మండలంలోని రంగాపూర్ ఉమామహేశ్వర స్వామి క్షేత్రంలో బుధవారం నుంచి వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. 15న ప్రభోత్సవం, 16న కళ్యాణోత్సవం, 17న అశ్వ వాహన సేవ, 18న నంది వాహన సేవ నిర్వహించనున్నట్లు ఆలయ ఛైర్మన్‌ మాధవరెడ్డి తెలిపారు. ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.

News January 13, 2026

ఇరాన్ నిరసనలు.. ఇతడికే తొలి ‘ఉరి’..!

image

సుప్రీం లీడర్ ఖమేనీకి వ్యతిరేకంగా ఇరాన్‌లో ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఇప్పటికే 650మందిని పోలీసులు కిరాతకంగా కాల్చి చంపారు. అయినా నిరసనకారులు వెనక్కి తగ్గకపోవడంతో వారిలో భయం పుట్టించేందుకు నియంతృత్వ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆందోళనలో పాల్గొన్న 26 ఏళ్ల ఇర్ఫాన్ సొల్తానీని రేపు ఉరి తీసేందుకు రంగం సిద్ధంచేసింది. దీంతో మానవహక్కుల ఉద్యమకారులు SMలో అతడికి మద్దతు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.